Breaking News

మ‌యాంక్ యాద‌వ్‌కు మ‌ళ్లీ గాయం.. ల‌క్నో జ‌ట్టులోకి కివీ స్పీడ్ స్టార్‌

Published on Thu, 05/15/2025 - 21:09

టీమిండియా స్పీడ్ స్టార్, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ఫాస్ట్ బౌల‌ర్ మ‌యాంక్ యాద‌వ్ మ‌రోసారి గాయ‌ప‌డ్డాడు. మ‌యాంక్ యాద‌వ్ వెన్ను గాయం కార‌ణంగా ఐపీఎల్‌-2025లో మిగిలిన మ్యాచ్‌ల‌కు దూర‌మ‌య్యాడు. ఈ విష‌యాన్ని ల‌క్నో ఫ్రాంచైజీ గురువారం ధ్రువీక‌రిచింది. కాగా మ‌యాంక్ ఈ ఏడాది సీజ‌న్ మ‌ధ్య‌లో గాయం నుంచి కోలుకుని  ల‌క్నో జ‌ట్టులో చేరాడు.

ఈ క్ర‌మంలో కేవ‌లం రెండు మ్యాచ్‌లు ఆడిన యాద‌వ్‌కు త‌న వెన్నుగాయం తిర‌గ‌బెట్టింది. దీంతో అత‌డు మ‌ళ్లీ బెంగ‌ళూరులోని ఏన్సీఎకు వెళ్ల‌నున్నాడు. త‌రుచూ గాయాల బారిన ప‌డ‌తుండ‌డంతో అత‌డి కెరీర్ ప్ర‌శ్నార్ధకంగా మారింది. ఇక మ‌యాంక్ యాద‌వ్ స్ధానాన్ని న్యూజిలాండ్ ఫాస్ట్ బౌల‌ర్ విలియం ఓరూర్క్‌తో ల‌క్నో భ‌ర్తీ చేసింది. 

కివీ పేస‌ర్‌ను రూ. 3 కోట్ల రిజర్వ్ ధ‌ర‌కు సూప‌ర్ జెయింట్స్ సొంతం చేసుకుంది. ఓ రూర్క్ న్యూజిలాండ్ జ‌ట్టులో ప్ర‌స్తుతం కీల‌క స‌భ్యునిగా కొన‌సాగుతున్నాడు. భార‌త‌గ‌డ్డ‌పై న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయ‌డంలో రూర్క్‌ది కీల‌క పాత్ర‌. ఈ క్ర‌మంలోనే అత‌డితో ల‌క్నో ఒప్పందం కుదుర్చుకుంది. 

మ‌రోవైపు పంజాబ్ కింగ్స్ కూడా గాయ‌ప‌డిన లాకీ ఫెర్గూస‌న్‌కు ప్రత్యామ్నాయ ఆట‌గాడిని ప్ర‌క‌టించింది. మ‌రో న్యూజిలాండ్ స్పీడ్ స్టార్ కైల్ జామీస‌న్ పంజాబ్ త‌మ జ‌ట్టులోకి తీసుకుంది. జామీస‌న్ గ‌తంలో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వ‌హించాడు. కాగా భార‌త్‌-పాకిస్తాన్ మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త‌ల కార‌ణంగా ఆర్ధ‌రంత‌రంగా ఆగిపోయిన ఈ ఏడాది ఐపీఎల్ సీజ‌న్.. తిరిగి మే 17 నుంచి ప్రారంభం కానుంది.
చదవండి: IND vs ENG: ఇంగ్లండ్ టూర్‌కు భార‌త జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌.. విధ్వంస‌క‌ర ఓపెన‌ర్ రీ ఎంట్రీ

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)