Breaking News

ఆర్సీబీ ఫ్యాన్స్‌ నాకు సపోర్ట్‌ చేశారు.. చాలా సంతోషంగా ఉంది: మయాంక్‌

Published on Thu, 04/04/2024 - 21:07

ఐపీఎల్‌-2024లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ పేస్‌ సంచలనం మయాంక్‌ యాదవ్‌ అద్భుత ప్రదర్శనతో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. మయాంక్‌ తన పేస్‌ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో సంచలనం సృష్టించిన మయాంక్‌.. తాజాగా ఆర్సీబీతో మ్యాచ్‌లలో మూడు కీలక వికెట్లు తీసి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు.

అయితే ఆర్సీబీతో మ్యాచ్‌ అనంతరం మయాంక్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆర్సీబీ తమ సొంత గ్రౌండ్‌లో ఆడుతున్నప్పటికి ఆ జట్టు అభిమానులు మాత్రం తనను ఎంతగానో సపోర్ట్‌ చేశారని మయాంక్‌ తెలిపాడు.

"జట్టు విజయాల్లో నా వంతు పాత్ర పోషించడం చాలా సంతోషంగా ఉంది. అయితే మా చివరి మ్యాచ్‌లో చిన్నస్వామి స్టేడియం ఆర్సీబీ అభిమానులతో నిండిపోయింది. ఆర్సీబీకి స్పెషల్‌ ఫ్యాన్‌ బేస్‌ఉంది. కానీ ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ అభిమానులు నన్ను సపోర్ట్‌ చేశారు.

నా స్పెల్ తర్వాత, నేను బౌండరీ లైన్‌ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఆర్సీబీ ఫ్యాన్స్‌ చప్పట్లు కొడుతూ నన్ను ఉత్సాహపరిచారు. ఇది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చిందని" మయాంక్‌ ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
 

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)