Breaking News

IPL 2025: పంత్ టీమ్‌కు గుడ్ న్యూస్‌.. స్పీడ్ గ‌న్ వ‌చ్చేస్తున్నాడు

Published on Mon, 04/14/2025 - 19:03

ఐపీఎల్‌-2025లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌కు గుడ్ న్యూస్ అందింది. ఆ జ‌ట్టు స్టార్ పేస‌ర్, యువ సంచ‌ల‌నం మ‌యాంక్ యాద‌వ్ పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. గాయం నుంచి కోలుకున్న మ‌యాంక్‌.. మంగ‌ళ‌వారం(ఏప్రిల్ 15) ల‌క్నో జ‌ట్టులోకి చేర‌నున్న‌ట్లు తెలుస్తోంది.

బెంగుళూరులోని సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ (CoE)  వైద్య బృందం మయాంక్‌కు  ఆదివారం ఫిట్‌నెస్ పరీక్ష‌లు నిర్వ‌హించింది. అందులో యాద‌వ్ ఉత్తీరణత సాధించాడు. దీంతో అత‌డికి  ఐపీఎల్‌లో ఆడేందుకు క్లియరెన్స్ స‌ర్టిఫికేట్‌ను సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ మంజారు చేసింది. 

ఈ ఏడాది సీజ‌న్‌లో ల‌క్నో విజ‌యాలు సాధిస్తున్న‌ప్ప‌టికి బౌలింగ్ మాత్రం అంతంత మాత్ర‌మేగా ఉంది. ఇప్పుడు మ‌యాంక్ తిరిగి రావ‌డంతో ల‌క్నో బౌలింగ్ విభాగం ప‌టిష్టంగా మార‌నుంది. ఇక  గ‌తేడాది సీజ‌న్‌తో ఐపీఎల్ అరంగేట్రం చేసిన మ‌యాంక్ యాద‌వ్‌.. త‌న అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌నతో ఓవ‌ర్ నైట్ స్టార్‌గా మారిపోయాడు. అయితే త‌రుచుగా గాయాల బారిన ప‌డ‌డంతో మ‌యాంక్ ఎక్కువ‌గా బెంచ్‌కే ప‌రిమిత‌మ‌య్యాడు. 

ఇప్ప‌టివ‌ర‌కు ఐపీఎల్‌లో కేవ‌లం 4 మ్యాచ్‌లు మాత్ర‌మే ఆడిన యాద‌వ్‌.. 7 వికెట్లు ప‌డ‌గొట్టాడు. గాయాల‌తో స‌త‌మ‌త‌వుతున్న‌ప్ప‌టికి ల‌క్నో మాత్రం అత‌డిపై న‌మ్మ‌కం ఉంచింది. ఐపీఎల్‌-2025 సీజ‌న్‌కు ముందు రూ.11 కోట్లకు అత‌డిని ల‌క్నో రిటైన్ చేసుకుంది. ల‌క్నో త‌మ త‌దుపరి మ్యాచ్‌లో సోమ‌వారం ఎక్నా స్టేడియం వేదిక‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది. అయితే ఈ మ్యాచ్‌కు కూడా మయాంక్ దూరం కానున్నాడు. ఏప్రిల్ 19న రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌కు అందుబాటులోకి రానున్నాడు.
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)