Breaking News

ఇంగ్లండ్‌లో కెరీర్‌ మొదలుపెట్టనున్న మయాంక్‌ అగర్వాల్‌

Published on Sat, 09/06/2025 - 08:48

ఆర్సీబీ ఆటగాడు, టీమిండియా వెటరన్‌ ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ త్వరలో ఇంగ్లండ్‌లో తన కెరీర్‌ను మొదలుపెట్టనున్నాడు. 3 మ్యాచ్‌ల స్వల్పకాలిక ఒప్పందంలో భాగంగా యార్క్‌షైర్‌కు ప్రాతినిథ్యం వహించనున్నాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్‌-2025లో భాగంగా సెప్టెంబర్ 8న సోమర్‌సెట్‌తో జరిగే మ్యాచ్‌తో మయాంక్‌ కౌంటీ అరంగేట్రం చేస్తాడు. 34 ఏళ్ల మయాంక్‌కు ఇదే తొలి కౌంటీ ఒప్పందం.

యార్క్‌షైర్‌తో స్వల్పకాలిక డీల్‌ తర్వాత మయాంక్‌ భారత్‌కు తిరుగు ప్రయాణం అవుతాడు. అక్టోబర్‌ 15 నుంచి ప్రారంభమయ్యే రంజీ ట్రోఫీలో పాల్గొంటాడు. మయాంక్‌ చివరిగా ఐపీఎల్‌-2025లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున ఆడాడు. ఆ సీజన్‌లో మయాంక్‌ ఛాంపియన్‌గా అవతరించింది.

దేవ్‌దత్‌ పడిక్కల్‌కు ప్రత్యామ్నాయంగా సీజన్‌ మధ్యలో జాయిన్‌ అయిన మయాంక్‌.. ఆర్సీబీ టైటిల్‌ సాధించే క్రమంలో పలు కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. పంజాబ్‌ కింగ్స్‌పై ఫైనల్లో ఆడిన 24 పరుగుల ఇన్నింగ్స్‌ అందులో ఒకటి.

మయాంక్‌ టీమిండియా తరఫున ఆడి దాదాపు నాలుగేళ్లవుతుంది. చివరిగా 2022 మార్చిలో శ్రీలంకతో టెస్ట్‌ మ్యాచ్‌ ఆడాడు. మయాంక్‌ భారత్‌ తరఫున 21 టెస్ట్‌లు ఆడి 41.3 సగటున 4 సెంచరీలు, 6 అర్ద సెంచరీల సాయంతో 1488 పరుగులు చేశాడు. 5 వన్డేల్లో 86 పరుగులు చేశాడు. మాయంక్‌ ఐపీఎల్‌ కెరీర్‌ ఘనంగా ఉంది. 131 మ్యాచ్‌ల్లో సెంచరీ, 13 అర్ద సెంచరీల సాయంతో 2756 పరుగులు చేశాడు. 

Videos

వైభవ్ పై BCCI ప్రత్యేక నిఘా

ఎవరు మంత్రి కావాలి..? ఎవరి మాట వినాలి?

సాక్ష్యాలతో వస్తాం .. సిద్ధంగా ఉండు..! లోకేష్ కు YSRCP ఎమ్మెల్సీ సవాల్

కూటమిలో లోకల్ వార్.. బాబుకు జనసేన, బీజేపీ హెచ్చరిక

ఎక్కడ దాక్కున్నావ్ లోకేష్.. కొండారెడ్డి బురుజుకు ఇప్పుడురా..

సరదాకు ఉద్యమాలు చేయడం లేదు.. ఇంకెంతకాలం సాగదీస్తావ్ చంద్రబాబు

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయడం కూటమి పిరికి చర్య..

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు