Breaking News

చరిత్ర సృష్టించిన మ్యాక్స్‌వెల్‌

Published on Sun, 08/17/2025 - 12:10

విధ్వంసకర ఆటగాడు గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ తన దేశం​ తరఫున టీ20ల్లో అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు అందుకున్న ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో మరో విధ్వంసకర ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ రికార్డును సమం చేశాడు. ఈ ఇద్దరు టీ20ల్లో చెరో 12 ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు అందుకున్నారు. వార్నర్‌ 110 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించగా.. మ్యాక్స్‌వెల్‌ 124 మ్యాచ్‌లో వార్నర్‌ రికార్డును సమం చేశాడు.

నిన్న (ఆగస్ట్‌ 16) సౌతాఫ్రికాతో జరిగిన నిర్ణయాత్మక మూడో టీ20లో మెరుపు అర్ద శతకం బాది, తన జట్టును గెలిపించిన మ్యాక్సీ.. తన టీ20 కెరీర్‌లో 12వ ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. ఓడిపోవాల్సిన ఈ మ్యాచ్‌లో మ్యాక్సీ విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడి తన జట్టుకు అద్భుత విజయాన్నందించాడు. మ్యాక్సీ ఆడిన ఈ మెరుపు ఇన్నింగ్స్‌ కారణంగా ఆసీస్‌ మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది.

తీవ్ర ఒత్తిడిలో మ్యాక్సీ ఆడిన ఈ ఇన్నింగ్స్‌ అతడి‌ టీ20 కెరీర్‌లో అత్యుత్తమైందిగా చెప్పుకోవచ్చు. 173 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసీస్‌ 88 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండింది. ఈ దశలో బరిలోకి దిగిన మ్యాక్సీ కళ్లు మూసి తెరిచేలోపు హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకొని తన జట్టును సేఫ్‌ జోన్‌లో ఉంచాడు. అంతేకాకుండా చివరి 2 బంతుల్లో 4 పరుగులు అవసమైన తరుణంలో ఊహించని షాట్‌ ఆడి తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్నందించాడు.

ఈ ఇన్నింగ్స్‌లో 36 బంతులు ఎదుర్కొన్న అతను 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయమైన 62 పరుగులు చేసి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ గెలుపుతో ఆసీస్‌ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఆసీస్‌, రెండో మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలుపొందాయి.

బ్రెవిస్‌ విధ్వంసం
అంతకుముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో విధ్వంసకర శతకం బాదిన డెవాల్డ్‌ బ్రెవిస్‌ ఈ మ్యాచ్‌లోనూ చెలరేగి ఆడాడు. 26 బంతుల్లో 6 సిక్సర్లు, ఓ బౌండరీ సాయంతో 53 పరుగులు చేశాడు. బ్రెవిస్‌ విధ్వంసానికి డస్సెన్‌ (38 నాటౌట్‌) మెరుపులు కూడా తోడవ్వడంతో సౌతాఫ్రికా ఓ మోస్తరు స్కోర్‌ చేయగలిగింది.

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)