Breaking News

భారత క్రికెట్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కలకలం..! నలుగురిపై వేటు

Published on Sat, 12/13/2025 - 11:01

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో అస్సాంకు చెందిన నలుగురు ఆట‌గాళ్లు మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు ప్ర‌య‌త్నించిన‌ట్లు తెలుస్తోంది. ఆ న‌లుగురు ప్లేయ‌ర్ల‌ను అమిత్ సిన్హా, ఇషాన్ అహ్మద్, అమన్ త్రిపాఠి, అభిషేక్ ఠాకుర్‌ల‌గా అస్సాం క్రికెట్ అసోసియేషన్ (ACA) గుర్తించింది.

దీంతో వారిపై ఏసీఎ  సస్పెన్ష‌న్ వేటు వేసింది. నవంబర్ 26 నుంచి డిసెంబర్ 8 వరకు లక్నోలో జరిగిన లీగ్ మ్యాచ్‌ల‌లో ఈ న‌లుగురు.. స‌హ‌చ‌ర ఆట‌గాళ్ల‌ను ప్రభావితం చేసేందుకు ప్ర‌య‌త్నించారంట‌. ఈ విష‌యాన్ని అస్సాం క్రికెట్ అసోసియేషన్ కార్య‌ద‌ర్శి సనాతన్ దాస్  ధ్రువీక‌రించారు. 

దర్యాప్తు పూర్తయ్యే వరకు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. అదేవిధంగా ఈ న‌లుగురిపై గువ‌హతిలోని  క్రైమ్ బ్రాంచ్‌లో ఎఫ్‌ఐఆర్ కూడా న‌మైంది. ఈ విష‌యంపై బీసీసీఐ అవినీతి నిరోధ‌క విభాగం ఇప్ప‌టికే ప్రాథమిక విచారణ చేప‌ట్టిన‌ట్లు స‌మాచారం. 

సస్పెండ్ అయిన వారిలో అభిషేక్ ఠాకూర్.. ఈ ఏడాది రంజీ సీజ‌న్‌లో అస్సాం త‌ర‌పున రెండు మ్యాచ్‌లు ఆడారు. మిగితా ప్లేయ‌ర్లు దేశీయ క్రికెట్‌లో వివిధ స్థాయిల్లో అస్సాంకు ప్రాతినిధ్యం వహించారు. టీమిండియా క్రికెటర్‌ రియాన్‌ పరాగ్‌ సైతం అస్సాంకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.
చదవండి: మెస్సీ కోసం హానీమూన్ మానుకున్న జంట‌

Videos

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)