Breaking News

మ్యాచ్ ఫిక్సింగ్ ముప్పు.. ఐపీఎల్ టీమ్స్‌కు బీసీసీఐ అలెర్ట్‌?

Published on Wed, 04/16/2025 - 17:35

ఐపీఎల్‌-2025కు మ్యాచ్ ఫిక్సింగ్ ముప్పు పొంచి ఉందా? అంటే అవునానే అంటుంది భార‌త క్రికెట్ బోర్డు. తాజాగా ఐపీఎల్‌లో మొత్తం ప‌ది జ‌ట్లకు బీసీసీఐ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త మ్యాచ్ ఫిక్సింగ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడ‌ని.. ఓనర్లు, ప్లేయర్లు, కోచ్‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని బీసీసీఐ సూచించినట్లు క్రిక్‌బజ్‌ పేర్కొంది.

క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. ఆ వ్యాపారవేత్తకు బుకీలతో సంబంధాలు ఉన్న‌ట్లు బీసీసీఐ అవినీతి నిరోధక భద్రతా విభాగం (ACSU) గుర్తించినట్లు తెలుస్తోంది. స‌ద‌రు వ్య‌క్తి ఇటీవలి కాలంలో చాలా మంది ప్లేయ‌ర్లు, కోచ్‌ల‌తో స్నేహం చేయడానికి ప్రయత్నిస్తున్న‌ట్లు క్రిక్‌బజ్‌ తెలిపింది.

డబ్బే కాకుండా విలువైన వస్తువులు గిప్ట్‌లు ఎరగా వేస్తాడని క్రిక్‌బ‌జ్ త‌మ రిపోర్ట్‌లో పేర్కొంది. ఈ క్ర‌మంలోనే అత‌డు ఎవరినైనా సంప్రదిస్తే తమకు సమాచారం అందించాలని బీసీసీఐ సూచించింది. కాగా ఐపీఎల్‌-2025 సీజ‌న్‌ ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. 

గుజ‌రాత్ టైటాన్స్‌, ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిట‌ల్స్, పంజాబ్ వంటి జ‌ట్లు దూసుకుపోతుంటే.. ముంబై ఇండియ‌న్స్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్ వంటి టాప్ జ‌ట్లు త‌డ‌బ‌డుతున్నాయి. ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో గుజ‌రాత్ టైటాన్స్ అగ్ర‌స్ధానంలో కొనసాగుతోంది.
చదవండి: IND vs ENG: టీమిండియాలోకి ట్రిపుల్ సెంచ‌రీ వీరుడు.. ఐదేళ్ల త‌ర్వాత రీ ఎంట్రీ?
 

Videos

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)