Breaking News

హైదరాబాద్‌కు 3 పాయింట్లు

Published on Wed, 11/12/2025 - 04:13

సాక్షి, హైదరాబాద్‌: రంజీ ట్రోఫీ గ్రూప్‌ ‘డి’లో హైదరాబాద్, రాజస్తాన్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ ‘డ్రా’గా ముగిసింది. సొంతగడ్డపై జరిగిన ఈ పోరులో తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం ద్వారా హైదరాబాద్‌ 3 పాయింట్లు తమ ఖాతాలో వేసుకోగా, రాజస్తాన్‌కు ఒక పాయింట్‌ దక్కింది. మంగళవారం 198/7 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన హైదరాబాద్‌ 78 ఓవర్లలో 244/9 స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది. క్రితం రోజు బ్యాటర్లలో తనయ్‌ త్యాగరాజన్‌ (4) కేవలం పరుగు మాత్రమే జతచేసి నిష్క్రమించాడు. 

రోహిత్‌ రాయడు (42; 1 ఫోర్లు, 1 సిక్స్‌) కాసేపు కుదురుగా ఆడాడు. టెయిలెండర్‌ అనికేత్‌ రెడ్డి (21 నాటౌట్, 2 ఫోర్లు)తో కలిసి తొమ్మిదో వికెట్‌కు 31 పరుగులు జోడించాక రోహిత్‌ను మహిపాల్‌ అవుట్‌ చేశాడు. పున్నయ్య (0 నాటౌట్‌) క్రీజులోకి రాగా... మరో పది బంతులకే ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. తొలి ఇన్నింగ్స్‌ 95 పరుగుల ఆధిక్యం కలుపుకొని ప్రత్యర్థి ముందు 340 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 

దీన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్తాన్‌ మ్యాచ్‌ ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 57 ఓవర్లలో 3 వికెట్లకు 207 పరుగులు చేసింది. టాపార్డర్‌ బ్యాటర్లు సచిన్‌ యాదవ్‌ (44; 5 ఫోర్లు, 1 సిక్స్‌), సల్మాన్‌ ఖాన్‌ (79; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), మహిపాల్‌ లొమ్రోర్‌ (40; 3 ఫోర్లు) రాణించారు. హైదరాబాద్‌ బౌలర్లలో తనయ్‌ త్యాగరాజన్‌ 2, అనికేత్‌ ఒక వికెట్‌ తీశారు. 

ఈ సీజన్‌లో 4 మ్యాచ్‌లాడిన హైదరాబాద్‌ ఒకటి గెలిచి, మిగతా మూడు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకుంది. ‘డి’ పాయింట్ల పట్టికలో ముంబై (17), జమ్మూ కశ్మీర్‌ (14) తర్వాత హైదరాబాద్‌ 13 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఈ నెల 16 నుంచి జమ్మూ వేదికపై జరిగే తదుపరి మ్యాచ్‌లో హైదరాబాద్‌... జమ్మూ కశ్మీర్‌తో తలపడుతుంది.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)