అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!
Breaking News
ఏడాదిన్నర క్రితమే విడాకులు.. డేటింగ్ రూమర్స్‌పై క్లారిటీ
Published on Thu, 05/01/2025 - 08:43
న్యూఢిల్లీ: భారత దిగ్గజ బాక్సర్, లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత మేరీకోమ్ (Mary Kom) తన వైవాహిక బంధం గురించి వస్తున్న వార్తలపై తొలిసారి స్పందించింది. తన భర్త కరుంగ్ ఓన్‌కోలర్ (Karong Onkholer Kom)తో దాదాపు ఏడాదిన్నరే క్రితమే విడిపోయినట్లు ఆమె ధ్రువీకరించింది. పెద్దల సమక్షంలో విడాకుల ప్రక్రియ కూడా పూర్తయినట్లు అధికారికంగా ప్రకటించింది.
కాగా ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ (Boxing World Champion)గా నిలిచిన 43 ఏళ్ల మేరీకోమ్ ఇటీవల తరచుగా వ్యక్తిగత అంశాలతో వార్తల్లో నిలిచింది. భర్తతో విడాకులతో పాటు హితేశ్ చౌధరీ అనే వ్యాపార్తవేత్తతో ఆమె బంధం గురించి కూడా తరచుగా కథనాలు వస్తున్నాయి. వీటన్నింటికి సమాధానమిస్తున్నట్లుగా తన లాయర్ ద్వారా మేరీ కోమ్ ఒక బహిరంగ ప్రకటనను విడుదల చేసింది.
‘కోమ్ చట్టాల ప్రకారం’ విడాకులు
‘మేరీకోమ్‌కు, ఓన్‌కోలర్‌కు మధ్య ఇప్పుడు ఎలాంటి సంబంధం లేదు. 2023 డిసెంబర్ 20న ఇద్దరి అంగీకారంతో ‘కోమ్ చట్టాల ప్రకారం’ కుటుంబసభ్యులందరి మధ్య వీరిద్దరికి విడాకులు మంజూరయ్యాయి. పెళ్లి అంతా ముగిసిన గతం కాబట్టి దానిపై ఏమీ వ్యాఖ్యానించదల్చుకోలేదు.
అవన్నీ వదంతులు మాత్రమే
మరోవైపు హితేశ్‌తో గానీ మరో బాక్సర్ భర్తతో గానీ ఆమెకు వ్యక్తిగత సంబంధం ఉన్నట్లుగా వస్తున్న వదంతుల్లో వాస్తవం లేదు. ఇకపై ఎవరూ దీనిని ప్రస్తావించరాదు. మేరీకోమ్ ఫౌండేషన్ వ్యవహారాలు చూసే వ్యక్తిగా హితేశ్‌తో వృత్తిపరమైన సంబంధం మాత్రమే ఉంది.
ఇకపై మేరీకోమ్‌కు సంబంధించి ఎలాంటి తప్పుడు వార్తలు రాయరాదని, ప్రచారం కల్పించరాదని విజ్ఞప్తి చేస్తున్నాం’ అని మేరీకోమ్ తరఫున ఆమె న్యాయవాది రజత్ మాథూర్ ప్రకటించారు. కాగా మణిపూర్‌కు చెందిన మేరీకోమ్, కరుంగ్ ఓన్‌కోలర్ వివాహం 2005లో జరిగింది. వీరిద్దరికి ముగ్గురు మగ పిల్లలుకాగా... 2018లో కరుంగ్ ఓన్‌కోలర్ ఒక పాపను దత్తత తీసుకున్నాడు.
చదవండి: మా గురించి మీకేం తెలుసు?.. మాకు అలాంటి పిచ్చిలేదు: సంజనా ఫైర్
Tags : 1