Breaking News

మార్టిన్ గప్టిల్ ఊచకోత.. 42 బంతుల్లో 160 పరుగులు! వీడియో వైర‌ల్‌

Published on Mon, 02/10/2025 - 21:06

న్యూజిలాండ్ మాజీ ఓపెన‌ర్ మార్టిన్ గ‌ప్టిల్‌ అంత‌ర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన‌ప్ప‌ట‌కి.. త‌న‌లో ఏ మాత్రం దూకుడు త‌గ్గ‌లేద‌ని మ‌రోసారి నిరూపించుకున్నాడు. లెజెండ్స్ 90 లీగ్ టోర్నీలో గ‌ప్టిల్ విధ్వంసం సృష్టిం‍చాడు. ఈ టోర్నీలో ఛత్తీస్‌గఢ్ వారియర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న గప్టిల్‌.. సోమవారం రాయ్‌పూర్ వేదికగా బిగ్ బాయ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు.

ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన గప్టిల్, ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. అత‌డి బ్యాటింగ్‌ విధ్వంసంతో రాయ్‌పూర్ స్టేడియం దద్ద‌రిల్లిపోయింది. కేవ‌లం 49 బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్న గ‌ప్టిల్‌.. 16 సిక్స్‌లు, 12 ఫోర్లతో 160 ప‌రుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అత‌డితో పాటు మ‌రో ఓపెన‌ర్ రిషి ధావ‌న్‌(42 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 76 నాటౌట్‌) హాఫ్ సెంచరీతో మెరిశాడు.

తద్వారా తొలుత బ్యాటింగ్ చేసిన ఛత్తీస్‌గఢ్ వారియర్స్ నిర్ణీత 90 బంతుల్లో వికెట్ నష్టపోకుండా 240 పరుగుల భారీ స్కోర్‌​ సాధించింది. అనంతరం 241 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బిగ్ బాయ్స్ జట్టు.. నిర్ణీత 90 బంతుల్లో 4 వికెట్లు కోల్పోయి 151 పరుగులకే పరిమితమైంది. బిగ్‌ బాయ్స్‌ బ్యాటర్లలో రాబిన్‌ బిస్ట్‌(55) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. సౌరబ్‌ తివారీ(37) పరుగులతో రాణించారు.  ఛత్తీస్‌గఢ్ వారియర్స్ బౌలర్లలో మనన్ శర్మ రెండు, అభిమన్యు మిథన్‌, ఖాలీం ఖాన్ తలా వికెట్ సాధించారు.

తిరుగులేని గప్టిల్‌..
కాగా న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలో గప్టిల్ తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. 16 ఏళ్ల పాటు కివీస్‌కు ప్రాతనిథ్యం వహించిన గప్టిల్‌.. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికాడు. టీ20ల్లో న్యూజిలాండ్ తరఫున అత్యధిక రన్స్‌ చేసిన ఆటగాడిగా గప్టిల్‌ ఉన్నాడు. 122 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో 3531 పరుగులు చేశాడు. వన్డేల్లోనూ న్యూజిలాండ్ తరఫున అత్యధిక పరుగులు (7,346) చేసిన మూడో బ్యాటర్‌గా ఉన్నాడు. అతడి కంటే ముందు రాస్‌ టేలర్ (8,607), స్టీఫెన్ ప్లెమింగ్ (8,007) ఉన్నారు.
చదవండి: ICC Champions Trophy: భార‌త్-పాకిస్తాన్ మ్యాచ్‌.. అంపైర్లు వీరే! ఐరెన్ లెగ్ లేడు
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)