Breaking News

స్వియాటెక్‌కు కొస్టుక్‌ షాక్‌ 

Published on Mon, 06/01/2026 - 06:24

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీలో ఈసారి సంచలనాల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పురుషుల సింగిల్స్‌ విభాగంలో ఈ ఏడాది కొత్త చాంపియన్‌ అవతరించడం ఖరారు కాగా... మహిళల సింగిల్స్‌ విభాగంలోనూ వరుసగా రెండో ఏడాది కొత్త విజేత రావడం ఖాయమైంది. మహిళల సింగిల్స్‌ బరిలో మిగిలిన నాలుగుసార్లు చాంపియన్, ప్రపంచ మూడో ర్యాంకర్‌ ఇగా స్వియాటెక్‌ (పోలాండ్‌)కు ఆదివారం అనూహ్య పరాజయం ఎదురైంది. దాంతో ఈసారీ మహిళల సింగిల్స్‌లో కొత్త క్వీన్‌ అవతరించనుంది. 

15వ సీడ్‌ మార్టా కొస్టుక్‌ (ఉక్రెయిన్‌) అద్భుత ఆటతీరుతో మెరిపించి 7–5, 6–1తో ‘బర్త్‌డే గర్ల్‌’ స్వియాటెక్‌ను బోల్తా కొట్టించి తొలిసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌లో క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ దక్కించుకుంది. 2019 తర్వాత స్వియాటెక్‌ రెండోసారి ఈ టోర్నీలో ప్రిక్వార్టర్‌ ఫైనల్లో వెనుదిరిగింది. 2020లో తొలిసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ చాంపియన్‌గా నిలిచిన స్వియాటెక్‌ 2021లో క్వార్టర్‌ ఫైనల్లో నిష్క్రమించింది. 2022, 2023, 2024లలో టైటిల్‌ నెగ్గి ‘హ్యాట్రిక్‌’ నమోదు చేసిన ఈ పోలాండ్‌ స్టార్‌...గత ఏడాది సెమీఫైనల్లో ఓడిపోయింది. 99 నిమిషాలపాటు జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో కొస్టుక్‌ ఐదు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. 

తొలి సర్వీస్‌లో 33 పాయింట్లు, రెండో సరీ్వస్‌లో 12 పాయింట్లు స్కోరు చేసింది. తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సరీ్వస్‌ను ఆరుసార్లు బ్రేక్‌ చేసింది. 25 విన్నర్స్‌ కొట్టిన ఈ ఉక్రెయిన్‌ భామ, 27 అనవసర తప్పిదాలు చేసింది. మరోవైపు స్వియాటెక్‌ ఒక్క ఏస్‌ కూడా కొట్టకుండానే, ఐదు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. 13 విన్నర్స్‌ కొట్టిన ఆమె, 39 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. ‘నేనింకా షాక్‌లోనే ఉన్నా. నాలుగుసార్లు ఫ్రెంచ్‌ ఓపెన్‌ గెలిచిన ప్లేయర్‌ను ఓడించానంటే నమ్మశక్యంగా లేదు’ అని ఈ ఏడాది క్లే కోర్టు సీజన్‌లో ఓటమి రుచి చూడని కొస్టుక్‌ వ్యాఖ్యానించింది. 

మరోవైపు ఏడో సీడ్‌ స్వితోలినా (ఉక్రెయిన్‌), ఎనిమిదో సీడ్‌ మిరా ఆండ్రీవా (రష్యా), 18వ సీడ్‌ సొరానా కిర్‌స్టీ (రొమేనియా) కూడా క్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టారు. ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో స్వితోలినా 4–6, 6–4, 6–0తో 11వ సీడ్‌ బెలిండా బెన్‌చిచ్‌ (స్విట్జర్లాండ్‌)పై, ఆండ్రీవా 6–3, 6–2తో జిల్‌ టెక్‌మన్‌ (స్విట్జర్లాండ్‌)పై, కిర్‌స్టీ 6–3, 7–6 (7/4)తో జియు వాంగ్‌ (చైనా)పై గెలిచారు. శనివారం జరిగిన మూడో రౌండ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్, నాలుగో సీడ్‌ కోకో గాఫ్‌ (అమెరికా) 6–4, 6–7 (1/7), 4–6తో అనస్తాసియా పొటపోవా (ఆ్రస్టియా) చేతిలో ఓటమి చవిచూసింది. 

క్వార్టర్‌ ఫైనల్లో జ్వెరెవ్‌ 
పురుషుల సింగిల్స్‌ విభాగంలో రెండో సీడ్, ప్రపంచ మూడో ర్యాంకర్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) వరుసగా ఆరో ఏడాది క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. జెస్పర్‌ డి జాంగ్‌ (నెదర్లాండ్స్‌)తో ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో జ్వెరెవ్‌ 7–6 (7/3), 6–4, 6–1తో గెలుపొందాడు. డిఫెండింగ్‌ చాంపియన్‌ అల్‌కరాజ్‌ (స్పెయిన్‌) గాయంతో ఈ టోర్నీకి దూరంగా ఉండటం... ప్రపంచ నంబర్‌వన్‌ యానిక్‌ సినెర్‌ (ఇటలీ) రెండో రౌండ్‌లో... మాజీ విజేత, సెర్బియా దిగ్గజం జొకోవిచ్‌ మూడో రౌండ్‌లో వెనుదిరగడంతో... జ్వెరెవ్‌ టైటిల్‌ ఫేవరెట్‌గా అవతరించాడు. 

జ్వెరెవ్‌ తన స్థాయికి తగ్గట్టు ఆడితే పారిస్‌లో ‘గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌’ కలను నిజం చేసుకుంటాడు. 2025 ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌లో.. 2024 ఫ్రెంచ్‌ ఓపెన్‌లో... 2020 యూఎస్‌ ఓపెన్‌లో ఫైనల్‌ చేరిన జ్వెరెవ్‌ మూడుసార్లూ ఓడిపోయి రన్నరప్‌గా నిలిచాడు. మరోవైపు స్పెయిన్‌ రైజింగ్‌ స్టార్‌ రాఫెల్‌ జొడార్‌ ఆడుతున్న రెండో గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలోనే క్వార్టర్‌ ఫైనల్‌కు చేరాడు. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో 19 ఏళ్ల జొడార్‌ 4–6, 4–6, 6–1, 6–2, 6–2తో పాబ్లో కరెనో బుస్టా (స్పెయిన్‌)పై గెలిచాడు.  మిక్స్‌డ్‌ డబుల్స్‌ రెండో రౌండ్‌లో యూకీ బాంబ్రీ (భారత్‌)–అలెగ్జాండ్రా పనోవా (రష్యా) ద్వయం 1–6, 3–6తో డెసిరె క్రాసిక్‌ (అమెరికా)–నీల్‌ స్కప్‌స్కీ (బ్రిటన్‌) జోడీ చేతిలో ఓడిపోయింది.   
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)