Breaking News

థ్రిల్లింగ్‌ లాస్ట్‌ ఓవర్‌.. నరాలు తెగే ఉత్కంఠ.. అనూహ్య మలుపులు

Published on Sun, 02/26/2023 - 17:52

ఆస్ట్రేలియా డొమెస్టిక్‌ వన్డే కప్‌ (మార్ష్‌ కప్‌) 2022-23 సీజన్‌లో రసవత్తర సమరం జరిగింది. థ్రిల్లింగ్‌ లాస్ట్‌ ఓవర్‌లో నరాలు తెగే ఉత్కంఠ నడుమ ఓ మ్యాచ్‌ అనూహ్య మలుపులకు వేదికైంది. గబ్బా వేదికగా క్వీన్స్‌ల్యాండ్‌-న్యూసౌత్‌వేల్స్‌ జట్ల మధ్య ఇవాళ (ఫిబ్రవరి 26) జరిగిన మ్యాచ్‌లో క్వీన్స్‌ల్యాండ్‌ జట్టు 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన క్వీన్స్‌ల్యాండ్‌.. 49.5 ఓవర్లలో 272 పరుగులకు ఆలౌట్‌ కాగా.. అనంతరం న్యూసౌత్‌ వేల్స్‌ లక్ష్యానికి 5 పరుగుల దూరంలో నిలిచిపోయి (49.5 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌట్‌) ఓటమిపాలైంది.

చివరి ఓవర్‌లో న్యూసౌత్‌ వేల్స్‌  గెలవాలంటే 14 పరుగులు చేయాల్సి ఉండగా (చేతిలో 2 వికెట్లు ఉన్నాయి).. స్టీవెన్‌ మెక్‌గిఫిన్‌ వేసిన తొలి బంతినే డ్వార్షుయిష్‌ సిక్సర్‌గా మలిచి గెలుపుపై ధీమాను పెంచాడు. అయితే ఆతర్వాత బంతికే డ్వార్షుయిష్‌ (20 బంతుల్లో 44; 5 సిక్సర్లు).. బ్లేక్‌ ఎడ్వర్డ్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఇక్కడే మ్యాచ్‌లో ఓ ట్విస్ట్‌ చోటు చేసుకుంది.

గజ్జల్లో గాయం కారణంగా స్టీవెన్‌ మెక్‌గిఫిన్‌ తప్పుకోవడంతో జోష్‌ బ్రౌన్‌ బంతిని అందుకున్నాడు. బ్రౌన్‌ వేసిన మూడో బంతి డాట్‌ బాల్‌ కాగా.. నాలుగో బంతిని లియామ్‌ హ్యచర్‌ బౌండరీకి తరలించాడు. చివరి రెండు బంతుల్లో 5 పరుగులు చేయల్సిన తరుణంలో లియామ్‌ హ్యాచర్‌ రనౌట్‌ కావడంతో మ్యాచ్‌ ముగిసింది. గెలుపుపై ధీమాగా ఉన్న న్యూసౌత్‌ వేల్స్‌ చివరి ఓవర్‌లో చతికిలపడి ఓటమిపాలైంది. ఈ విజయంలో క్వీన్స్‌ల్యాండ్‌ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంతో సీజన్‌ను ముగించగా.. న్యూసౌత్‌వేల్స్‌ చిట్టచివరి ప్లేస్‌తో సీజన్‌ను ముగించింది. ఫైనల్‌ మ్యాచ్‌ వెస్టర్న్‌ ఆస్ట్రేలియా-సౌత్‌ ఆస్ట్రేలియా మధ్య మార్చి 8న జరుగుతుంది.    

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)