Breaking News

IPL 2023: నా ఫేవరెట్‌ జట్టు అదే! అతడు చుక్కలు చూపించాడు..

Published on Mon, 03/27/2023 - 15:31

India Vs Australia 2023: అవకాశం వస్తే టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లితో కలిసి బ్యాటింగ్‌ చేయాలని ఉందని ఆస్ట్రేలియా బ్యాటర్‌ మార్నస్‌ లబుషేన్‌ అన్నాడు. కోహ్లితో కలిసి వికెట్ల మధ్య పరిగెత్తడం బాగుంటుందంటూ తమ మనసులో మాట బయటపెట్టాడు. ఇటీవల టీమిండియాతో ముగిసిన బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ-2023 సిరీస్‌లో లబుషేన్‌ మెరుగైన ప్రదర్శన కనబరిచాడు.

నాలుగు టెస్టుల్లో కలిపి 244 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడీ రైట్‌హ్యాండ్‌ బ్యాటర్‌. ఇక వన్డే సిరీస్‌ గెలిచిన తర్వాత స్వదేశానికి పయనమైన లబుషేన్‌.. భారత్‌కు కృతజ్ఞతలు చెబుతూ వీడ్కోలు పలికాడు.

ప్రస్తుతం ఇంట్లో ఉన్న ఈ బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌.. ట్విటర్‌లో కాసేపు అభిమానులతో ముచ్చటించాడు. క్వశ్చన్‌ & ఆన్సర్స్‌ సెషన్‌లో భాగంగా అరగంట పాటు వారికి సమయం కేటాయించాడు. ఈ క్రమంలో ఫ్యాన్స్‌ అడిగిన వివిధ ప్రశ్నలకు లబుషేన్‌ జవాబులు చెప్పాడు.

స్టీవ్‌ స్మిత్‌తో కాకుండా వేరెవరితో బ్యాటింగ్‌ చేయడాన్ని ఇష్టపడతావని అడుగగా.. విరాట్‌ కోహ్లి పేరు చెప్పాడు. ఇక ప్రపంచంలో అత్యుత్తమ స్పిన్నర్‌ ఎవరని ప్రశ్నించగా.. రవిచంద్రన్‌ అశ్విన్‌ అంటూ ఠక్కున సమాధానమిచ్చాడు. ఇటీవల ముగిసిన బీజీటీ-2023 సిరీస్‌లో తనకు ఈ సీనియర్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ చుక్కలు చూపించాడని ఈ వరల్డ్‌ నంబర్‌ 1 బ్యాటర్‌ అన్నాడు.

ఇక టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌ను ఆస్వాదిస్తానన్న మార్నస్‌ లబుషేన్‌.. ఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తన ఫేవరెట్‌ టీమ్‌ అని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్‌-2022లో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయిన ఈ స్పిన్‌ ఆల్‌రౌండర్‌ ఈసారి తన పేరును మినీ వేలంలో నమోదు చేసుకోలేదు.
చదవండి: Sanju Samson: టీమిండియాలో చోటు దక్కకపోతేనేం.. బంపర్‌ ఆఫర్‌ కొట్టేశాడుగా..!
Steve Smith- IPL 2023: నమస్తే ఇండియా! తిరిగి వచ్చేస్తున్నా.. అద్భుతమైన జట్టుతో..

Videos

Paradise: ఆ పాట లేకుండానే రిలీజ్.?

2029.. ఏ ఒక్కడిని వదిలిపెట్టను... అనిల్ కుమార్ యాదవ్ మాస్ వార్నింగ్

మజ్జి శ్రీనివాసరావు TDPలో చేరికపై కొండ రాజీవ్ స్ట్రాంగ్ రియాక్షన్

యూకేలో అల్లకల్లోలం.. వెయ్యికి పైగా విమానాలు రద్దు..

అక్క స్కెచ్ అదిరిందిగా! బిగ్ బాస్ లోకి రమానందన వైల్డ్ కార్డ్ ఎంట్రీ?

ఇది పద్దతి కాదు.. కేటీఆర్ పై స్పీకర్ సీరియస్

వైభవ్..నువ్వు సూపర్ రా! బుడోడిపై ఇషాన్ ప్రశంసలు

అడ్డంగా ఇరుక్కున్నాక లోకేశ్ వాయిస్ లో బేస్ తగ్గింది..

అంతర్జాతీయంగా దుమారం రేపుతున్న ట్రంప్ పోస్ట్

ఇన్వెస్టర్లకు బిగ్ అప్ డేట్.. కొత్త ట్రేడింగ్ రూల్స్ ఇవే!

Photos

+5

భార్యతో సుకుమార్.. 80s రెట్రో లుక్‌లో అదిరిపోయే.. (ఫొటోలు)

+5

రష్మిక పాత ఫొటోలు.. క్యూట్‌నెస్‌కు ఫిదా అవ్వాల్సిందే (ఫోటోలు)

+5

భార్య ప్రేమలో నాగశౌర్య.. క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

ఓయూలో ఘనంగా 85వ స్నాతకోత్సవం (ఫోటోలు)

+5

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫొటోలు)

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)