దంచికొట్టిన మార్క్రమ్‌.. విండీస్‌ను చిత్తు చేసిన సౌతాఫ్రికా

Published on Wed, 01/28/2026 - 15:13

టీ20 ప్రపంచకప్‌ 2026కి ముందు స్వదేశంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల  టీ20 సిరీస్‌లో సౌతాఫ్రికా ఘనంగా బోణీ కొట్టంది. పార్ల్‌ వేదికగా నిన్న జరిగిన తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వికెట్ల పరంగా సౌతాఫ్రికా టీ20 చరిత్రలో విండీస్‌పై ఇదే భారీ విజయం. 

ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టింది. తొలుత బౌలింగ్‌లో, ఆతర్వాత బ్యాటింగ్‌లో సత్తా చాటింది. బౌలింగ్‌లో జార్జ్‌ లిండే (4-0-25-3), కార్బిన్‌ బాష్‌ (4-0-35-2), కేశవ్‌ మహారాజ్‌ (4-0-44-2), రబాడ (4-0-35-0), మఫాకా (4-0-30-0) రాణించడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. 

హెట్‌మైర్‌ (48), రోవ్‌మన్‌ పావెల్‌ (29 నాటౌట్‌), బ్రాండన్‌ కింగ్‌ (27), కెప్టెన్‌ రోస్టన్‌ ఛేజ్‌ (22) తలో చేయి వేయడంతో ఈ స్కోర్‌ చేయగలిగింది. మిగతా బ్యాటర్లలో జాన్సన్‌ ఛార్ల్‌స్‌ 13, మాథ్యూ ఫోర్డ్‌ 16, రూథర్‌ఫోర్డ్‌ 6, జేసన్‌ హోల్డర్‌ ఒక్క పరుగు చేసి ఔటయ్యారు.

అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా సునాయాసంగా విజయతీరాలకు చేరింది. కెప్టెన్‌ ఎయిడెన్‌ మార్క్రమ్‌ (86 నాటౌట్‌) అజేయ అర్ద సెంచరీతో సౌతాఫ్రికాను గెలుపు తీరాలు దాటించాడు. అతని ప్రిటోరియస్‌ (44), రికెల్టన్‌ (40 నాటౌట్‌) సహకరించారు. 

ఫలితంగా సౌతాఫ్రికా 17.5 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సౌతాఫ్రికా కోల్పోయిన ఏకైక వికెట్‌ రోస్టన్‌ ఛేజ్‌కు దక్కింది. ఈ సిరీస్‌లోని రెండో టీ20 జనవరి 29న సెంచూరియన్‌ వేదికగా జరుగనుంది.

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)