చ‌రిత్ర సృష్టించిన మార్‌క్రమ్.. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ!?

Published on Tue, 09/02/2025 - 21:21

సౌతాఫ్రికా స్టార్ ప్లేయ‌ర్ ఐడైన్ మార్‌క్ర‌మ్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. ఇంగ్లండ్‌పై వ‌న్డేల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచ‌రీ చేసిన సౌతాఫ్రికా ప్లేయ‌ర్‌గా మార్‌క్ర‌మ్ చ‌రిత్ర సృష్టించాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన మాకర్‌క్రమ్‌.. ఈ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. 

ఇంతకుముందు ఈ రికార్డు ప్రోటీస్ ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ పేరిట ఉండేది. మోరిస్ 2016లో జోహన్స్ బర్గ్ వేదికగా ఇంగ్లీష్ జట్టుతో జరిగిన వన్డేలో 30 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. తాజా మ్యాచ్‌తో మోరిస్ ఆల్‌టైమ్ రికార్డును ఐడైన్ బ్రేక్ చేశాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో వీరిద్దరి తర్వాత స్ధానంలో మిల్లర్‌(33 బంతులు) ఉన్నాడు.

మార్‌క్రమ్ విధ్వం‍సం..
కాగా 132 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో మార్‌క్రమ్ విధ్వంసం సృష్టించాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ఇంగ్లండ్ బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డాడు. కేవలం​ 55 బంతులు మాత్రమే ఎదుర్కొన్న మార్‌క్రమ్‌.. 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 86 పరుగులు చేశాడు. అతడితో పాటు మరో ఓపెనర్‌ రికెల్టన్‌(31) రాణించాడు. 

దీంతో టార్గెట్‌ను సౌతాఫ్రికా కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 20.5 ఓవర్లలో చేధించింది. ఇంగ్లండ్ బౌలర్లలో అదిల్ రషీద్ ఒక్కడే మూడు వికెట్లు సాధించాడు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ 24.3 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 131 ప‌రుగుల‌కే ఆలౌటైంది. సౌతాఫ్రికా బౌలర్లలో స్పిన్నర్‌ కేశవ్‌ మహారాజ్‌ నాలుగు వికెట్లు పడగొట్టగా.. ముల్డర్‌ 3 వికెట్లు సాధించాడు.
చదవండి: ENG vs SA: చ‌రిత్ర సృష్టించిన కేశవ్ మహారాజ్‌..

Videos

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)