Breaking News

ఇంగ్లండ్ జ‌ట్టులోకి ఎవ‌రూ ఊహించ‌ని ప్లేయ‌ర్‌

Published on Tue, 12/09/2025 - 12:58

యాషెస్ సిరీస్ 2025-26లో వరుస ఓటములతో సతమవుతున్న ఇంగ్లండ్‌కు మరో భారీ షాక్ తగిలింది. ఈ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ ఎడమ మోకాలి గాయం కారణంగా యాషెస్ సిరీస్‌లో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు.

ఈ ఏడాది మార్చిలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో వుడ్ మోకాలి గాయం బారిన పడ్డాడు. దీంతో ఆ టోర్నీ మధ్యలోనే వైదొలిగాడు.  ఆ తర్వాత మోకాలికి శస్త్రచికిత్స (knee surgery) చేయించుకుని దాదాపు ఆరు నెలల పాటు ఆటకు దూరంగా ఉన్నాడు.

పూర్తి ఫిట్‌నెస్ సాధించడంతో అతడిని ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌కు ఎంపిక చేసింది. అయితే పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో అతడికి  మళ్లీ ఎడమ మోకాలి గాయం తిరగబెట్టింది. అతడు కోలుకోవడానికి నాలుగు నుంచి ఐదు వారాల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతడిని జట్టు నుంచి తప్పించారు.

మూడేళ్ల తర్వాత.. 
ఇక​ వుడ్ స్థానంలో యార్క్‌షైర్ పేసర్ మ్యాథ్యూ ఫిషర్ ను జట్టులోకి తీసుకున్నారు. మ్యాథ్యూ ఫిషర్ ఇంగ్లండ్ జట్టుకు ఎంపిక కావడం మూడేళ్ల తర్వాత ఇదే తొలిసారి. ఫిషర్ 2022లో ఇంగ్లండ్ తరపున టెస్టు అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు ఒకే మ్యాచ్ ఆడి ఒక్క వికెట్ సాధించాడు.

ఆ తర్వాత అతడిని సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. మళ్లీ ఇప్పుడు మూడేళ్ల తర్వాత సెలక్టర్ల నుంచి పిలుపు అందుకున్నాడు. అయితే అతడికి తుది జట్టులో చోటు దక్కడం కష్టమే అని చెప్పాలి. ఎందకంటే ఇప్పటికే బ్యాకప్ పేసర్లగా మ్యాథ్యూ పాట్స్ (Matthew Potts), జోష్ టంగ్ (Josh Tongue) వంటి ఆటగాళ్లు ఉన్నారు. 

మరోవైపు ఆసీస్ స్టార్ పేసర్ జోష్ హాజిల్ వుడ్ కూడా గాయం కారణంగా ఈ ప్రతిష్టాత్మక సిరీస్ నుంచి తప్పుకొన్నాడు. ఇరు జట్ల మధ్య మూడో టెస్టు డిసెంబర్ 17 నుంచి అడిలైడ్ వేదికగా ప్రారంభం కానుంది. ఇంగ్లండ్ ప్రస్తుతం 0-2 తేడాతో వెనకంజలో ఉంది.
చదవండి: IND vs SA: టీమిండియాకు భారీ షాక్‌..!
 

Videos

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)