Breaking News

మరి నీవు మారవా? వెళ్లి గల్లీ క్రికెట్‌ ఆడుకో పో! వీడియో వైరల్‌

Published on Thu, 12/28/2023 - 12:46

మెల్‌బోర్న్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్తాన్‌ తమ పేలవ ఫీల్డింగ్‌ ప్రదర్శనను కొనసాగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో రెండు క్యాచ్‌లు విడిచిపెట్టిన పాక్‌ స్టార్‌ ఓపెనర్‌ అబ్దుల్లా షఫీక్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఈజీ క్యాచ్‌ను జారవిడిచాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ కేవలం 16 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లోపడింది. ఈ క్రమంలో మిచెల్‌ మార్ష్‌, స్టీవ్‌ స్మిత్‌ ఆసీస్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు.

అయితే పాకిస్తాన్‌ కెప్టెన్‌ షాన్‌ మసూద్‌ మాత్రం బౌలర్లను మారుస్తూ ఆసీస్‌ను ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో 15 ఓవర్‌ వేసేందుకు అమీర్‌ జమీల్‌ చేతికి బంతిని అందించాడు. ఆ ఓవర్‌లో తొలి బంతిని మార్ష్‌ డిఫెన్స్‌ ఆడే ప్రయత్నం చేశాడు. బంతి ఎడ్జ్‌ తీసుకుని సెకెండ్‌ స్లిప్‌ దిశగా వెళ్లింది. అయితే సెకెండ్‌ స్లిప్‌లో ఉన్న షఫీక్ ఈజీ క్యాచ్‌ను అందుకోవడంలో విఫలమయ్యాడు.

అందుకు పాకిస్తాన్‌ భారీ మూల్యం చెల్లించుకోంది. 20 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న మార్ష్‌.. ఏకంగా 96 పరుగులు చేశాడు. దీంతో షఫీక్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. ఈ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న ఆసీస్‌ దిగ్గజం మార్క్‌ వా సైతం ఆంసతృప్తి వ్యక్తం చేశాడు.

'మొసలి దవడలా క్యాచ్‌ పడుతున్నాడు..  వెంటనే అతడిని అక్కడ నుంచి తీసియేండి' అని అన్నాడు. అదే విధంగా ఓ సోషల్‌ మీడియా యూజర్‌ 'మరి నీవు మారవా? వెళ్లి గల్లీ క్రికెట్‌ ఆడుకో పో' అంటూ ఓ పోస్ట్‌ చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 57 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ప్రస్తుతం 230 పరుగుల అధిక్యంలో ఆసీస్‌ కొనసాగుతోంది.
చదవండి: IND vs SA: 'అతడిని టీమిండియా మిస్సవుతోంది.. సౌతాఫ్రికాకు చుక్కలు చూపించేవాడు'

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)