బౌలర్‌ పెట్టిన బిక్షతో మ్యాచ్‌ను గెలిపించాడు

Published on Thu, 06/22/2023 - 13:44

జింబాబ్వే ఆతిథ్యమిస్తున్న ఐసీసీ క్రికెట్‌ వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్‌ మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ప్రధానంగా వెస్టిండీస్‌, జింబాబ్వే,శ్రీలంకలు ఫెవరెట్‌గా కనిపిస్తున్నాయి. తాజాగా బుధవారం స్కాట్లాండ్‌, ఐర్లాండ్‌ మధ్య జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో చిత్రమైన సన్నివేశం చోటుచేసుకుంది. నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్న బ్యాటర్‌ను రనౌట్‌(మన్కడింగ్‌) చేసే ప్రయత్నం చేయడం ఆసక్తి కలిగించింది.

చేజింగ్‌లో భాగంగా స్కాట్లాండ్‌కు ఆఖరి ఓవర్‌లో 8 పరుగులు కావాల్సి ఉంది. ఆఖరి ఓవర్‌ మార్క్‌ అడైర్‌ వేశాడు. అడైర్‌ వేసిన తొలి రెండు బంతులకు ఫోర్‌ సహా సింగిల్‌ తీశాడు. మూడో బంతిని వేసే సమయంలో నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్న లీస్క్‌ క్రీజు బయటికి వచ్చాడు. ఇది గమనించిన మార్క్‌ అడైర్‌ బంతి వేయడం ఆపివేసి మన్కడింగ్‌ చేసే ప్రయత్నం చేశాడు.

కానీ ఇంతలో అలర్ట్‌ అయిన లీస్క్‌ వెంటనే బ్యాట్‌ను క్రీజులో ఉంచాడు. అలా బతికిపోయిన లీస్క్‌ ఆఖరి బంతికి ఫోర్‌ కొట్టి స్కాట్లాండ్‌కు ఒక్క వికెట్‌ తేడాతో మరిచిపోలేని విజయాన్ని అందించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన అభిమానులు.. మ్యాచ్‌లో ఐర్లాండ్‌ గెలవాల్సింది.. తమ ఫీల్డింగ్‌ తప్పిదాలతో పాటు ఆ జట్టు బౌలర్‌  పెట్టిన బిక్షతో లీస్క్‌ తన జట్టును గెలిపించుకున్నాడు అంటూ కామెంట్‌ చేశారు.

చదవండి: #CWCQualifiers2023: స్కాట్లాండ్‌ ప్లేయర్‌ విధ్వంసం; ఒక్క వికెట్‌ తేడాతో సంచలన విజయం

వీడిన మిస్టరీ.. వార్న్‌ ఆకస్మిక మరణానికి కారణం అదేనా!

Videos

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)