Breaking News

జోర్డాన్‌కు చుక్కలు.. ఐపీఎల్‌ కెరీర్‌లో అత్యధిక స్కోరు

Published on Tue, 05/16/2023 - 22:44

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌ ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టోయినిస్‌ తన సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. తాజాగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో స్టోయినిస్‌ సంచలన ఇన్నింగ్స్‌ ఆడాడు. 35 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో కృనాల్‌తో కలిసి స్టోయినిస్‌ ఇన్నింగ్స్‌ నిర్మించాడు.  

ఈ క్రమంలో కాస్త మెల్లిగా ఆడినప్పటికి ఒక్కసారి కుదురుకున్నాకా తన బ్యాటింగ్‌ పవర్‌ను చూపెట్టాడు. 36 బంతుల్లో ఫిఫ్టీ మార్క్‌ అందుకున్న స్టోయినిస్‌ ఓవరాల్‌గా 47 బంతుల్లో 89 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో ఆ ఫోర్లు, 8 సిక్సర్ల ఉన్నాయి. 36 బంతుల్లో ఫిఫ్టీ మార్క్‌ అందుకున్న స్టోయినిస్‌ తర్వాతి 13 బంతుల్లోనే 39 పరుగులతో విధ్వంసం సృష్టించాడు.

ఇక ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌ వేసిన క్రిస్‌ జోర్డాన్‌కు స్టోయినిస్‌ చుక్కలు చూపించాడు. రెండు సిక్సర్లు, మూడు ఫోర్లతో 24 పరుగులు పిండుకున్నాడు. దీంతో క్రిస్‌ జోర్డాన్‌ ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత చెత్త రికార్డు నమోదు చేశాడు. ఐపీఎల్‌ వందకు పైగా ఓవర్లు వేసి అత్యధిక ఎకానమీ రేటుతో పరుగులు ఇచ్చిన రెండో బౌలర్‌గా క్రిస్‌ జోర్డాన్‌ నిలిచాడు. ఈ జాబితాలో స్టోయినిస్‌ 9.58 ఎకానమీ రేటుతో తొలి స్థానంలో, సామ్‌ కరన్‌ 9.48 రేటతో మూడు, ఆండ్రీ రసెల్‌ 9.26, శార్దూల్‌ ఠాకూర్‌ 9.13తో నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు.

ఇక స్టోయినిస్‌ 47 బంతుల్లో 89 పరుగులు నాటౌట్‌గా నిలిచి తన ఐపీఎల్‌ కెరీర్‌లో అత్యధిక స్కోరును సాధించాడు. ఇంతకముందు స్టోయినిస్‌ అత్యధిక స్కోరు 72గా ఉంది. లక్నో తరపున స్టోయినిస్‌ది మూడో అత్యధిక స్కోరు కావడం విశేషం. తొలి స్థానంలో క్వింటన్‌ డికాక్‌ 140 పరుగులు, కేఎల్‌ రాహుల్‌ 103* రెండో స్థానంలో ఉన్నాడు.

చదవండి: 'ఆడడమే వ్యర్థమనుకుంటే బ్యాటింగ్‌లో ప్రమోషన్‌'

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)