Breaking News

Qualifier 1: స్టార్‌ బౌలర్‌ దూరం.. బలహీనంగా కనిపిస్తున్న పంజాబ్‌ బౌలింగ్‌ విభాగం

Published on Thu, 05/29/2025 - 16:03

ఐపీఎల్‌ 2025లో భాగంగా ఆర్సీబీతో ఇవాళ (మే 29) జరుగబోయే క్వాలిఫయర్‌-1కు ముందు పంజాబ్‌ కింగ్స్‌ బౌలింగ్‌ విభాగం బలహీనంగా కనిపిస్తుంది. ఈ మ్యాచ్‌కు ఆ జట్టు స్టార్‌ పేసర్‌ మార్కో జన్సెన్‌ దూరమయ్యాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌ దృష్ట్యా అతను స్వదేశానికి వెళ్లిపోయాడు. జన్సెన్‌ స్థానాన్ని అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ భర్తీ చేసే అవకాశం ఉంది. కీలకమైన ఈ మ్యాచ్‌లో జన్సెన్‌ లేకపోవడం పంజాబ్‌ విజయావకాశాలను తప్పక ప్రభావితం చేస్తుంది.

చహల్‌ ఆడేది కూడా అనుమానమే..!
నేటి మ్యాచ్‌లో పంజాబ్‌ స్టార్‌ స్పిన్నర్‌ యుజ్వేంద్ర చహల్‌ ఆడేది కూడా అనుమానమే అని తెలుస్తుంది. చహల్‌ కొద్ది రోజుల కిందట గాయపడ్డాడు (చేతి వేలికి). ఈ కారణంగా అతను గత రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. కీలక మ్యాచ్‌ కావడంతో పంజాబ్‌ యాజమాన్యం చహల్‌ను బరిలోకి దించే సాహసం చేయవచ్చు.

జన్సెన్‌, చహల్‌ లాంటి నాణ్యమైన బౌలర్లు నేటి మ్యాచ్‌లో ఆడకపోతే పంజాబ్‌కు ఇబ్బందులు తప్పకపోవచ్చు. వీరిద్దరు మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చేయగల బౌలర్లు. వీరి గైర్హాజరీలో పంజాబ్‌ బౌలింగ్‌ విభాగం బలహీనంగా కనిపిస్తుంది. నంబర్‌ వన్‌ టీ20 బౌలర్‌ అర్షదీప్‌ ఉన్నా ఒక్కడు ఏ మేరకు ప్రభావం చూపగలడో చూడాలి. 

జేమీసన్‌, ఒమర్‌జాయ్‌ లాంటి పేసర్లు ఉన్నా వారి నుంచి అతిగా ఆశించలేని పరిస్థితి. స్పిన్‌ విభాగంలో హర్ప్రీత్‌ బ్రార్‌పై కొద్దొగొప్పో నమ్మకాలు పెట్టుకోవచ్చు. ఒకవేళ చహల్‌ దూరమైతే అతని స్థానంలో విజయ్‌కుమార్‌ వైశాక్‌ ఆడవచ్చు. అయితే వైశాక్‌ చహల్‌ లేని లోటును భర్తీ చేయలేడు. 

వైశాక్‌ తుది జట్టులోకి వస్తే పంజాబ్‌ స్పిన్‌ విభాగాన్ని హర్ప్రీత్‌ బ్రార్‌ ఒక్కడే మోయాల్సి వస్తుంది. కాబట్టి గాయం తగ్గకపోయినా నేటి మ్యాచ్‌లో పంజాబ్‌ యాజమాన్యం చహల్‌ను బరిలోకి దించవచ్చు. భీకర ఫామ్‌లో ఉన్న విరాట్‌ కోహ్లిని బలహీనంగా కనిపిస్తున్న ఈ పంజాబ్‌ బౌలింగ్‌ యూనిట్‌ ఏ మేరకు నిలువరించగలదో చూడాలి.

బౌలింగ్‌ విషయాన్ని పక్కన పెడితే.. పంజాబ్‌ బ్యాటింగ్‌ విభాగం అత్యంత పటిష్టంగా ఉంది. ఈ జట్టులో దాదాపు అందరు బ్యాటర్లు మంచి ఫామ్‌లో ఉన్నారు. ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్‌, ప్రియాంశ్‌ ఆర్య ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. ఇంగ్లిస్‌ గత మ్యాచ్‌లో తడాకా చాటాడు. 

శ్రేయస్‌ సీజన్‌ ఆరంభం నుంచి మంచి టచ్‌లో ఉన్నాడు. నేహల్‌ వధేరా, శశాంక్‌ సింగ్‌ ఇన్నింగ్స్‌ చివర్లో అద్భుతాలు చేయడం​ చూశాం​. పంజాబ్‌ బ్యాటింగ్‌ విభాగాన్ని స్టోయినిస్‌ ఫామ్‌ ఒక్కటే కలవరపెడుతుంది. ఇతను కూడా నేటి మ్యాచ్‌లో టచ్‌లోకి వస్తే ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు కనిపిస్తాయి.

నేటి మ్యాచ్‌లో పంజాబ్‌ తుది జట్టు (అంచనా)..
ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్ (WK), శ్రేయస్ అయ్యర్ (C), నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, హర్‌ప్రీత్ బ్రార్, కైల్ జామీసన్, అర్ష్‌దీప్ సింగ్, వైషాక్ విజయ్‌కుమార్/యుజ్వేంద్ర చాహల్
ఇంపాక్ట్ ప్లేయర్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)