Breaking News

‘మిషన్‌ 2028’ మొదలైంది...

Published on Thu, 08/08/2024 - 04:31

న్యూఢిల్లీ: నాలుగేళ్ల తర్వాత జరగనున్న 2028 లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌ కోసం ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని భారత స్టార్‌ షూటర్‌ మనూ భాకర్‌ వెల్లడించింది. పారిస్‌ ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు సాధించిన మనూ బుధవారం స్వదేశానికి తిరిగి వచి్చంది. స్థానిక ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మనూ భాకర్, ఆమె కోచ్‌ జస్పాల్‌ రాణాకు ఘనస్వాగతం లభించింది. 

22 ఏళ్ల మనూ భాకర్‌ పారిస్‌ ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత విభాగంతో పాటు మిక్స్‌డ్‌ విభాగంలో కాంస్య పతకాలు గెలుచుకొని.. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు నెగ్గిన తొలి భారత మహిళగా రికార్డు నెలకొలి్పన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మనూ భాకర్‌ మాట్లాడుతూ. ‘పారిస్‌ ఒలింపిక్స్‌ ముగింపు దశకు చేరుకున్నాయి. నేనప్పుడే 2028 లాస్‌ ఏంజెలిస్‌ క్రీడల కోసం ప్రయాణం ప్రారంభించా. 

కాస్త విరామం అనంతరం సాధన మొదలుపెడతాను. భవిష్యత్తులోనూ ఇదే నిలకడ చూపేందుకు ప్రయతి్నస్తా. అందుకోసం మరింత శ్రమిస్తా. కాకపోతే ఇప్పుడు కొంతకాలం కుటుంబ సభ్యులతో గడుపుతాను. మూడు నెలల తర్వాత తిరిగి షూటింగ్‌ ప్రాక్టీస్‌ ప్రారంభిస్తా’ అని ఆమె వెల్లడించింది. విశ్వక్రీడల్లో రెండు పతకాలు సాధించడంతో పాటు 25 మీటర్ల పిస్టల్‌ వ్యక్తిగత విభాగంలో త్రుటిలో పతకం చేజార్చుకున్న మనూ భాకర్‌.. శనివారం తిరిగి పారిస్‌ వెళ్లనుంది. ఒలింపిక్స్‌ ముగింపు వేడుకల్లో మనూ భారత బృందానికి పతాకధారిగా వ్యవహరించనుంది.   
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)