Breaking News

‘పెళ్లి కార్నర్‌’లో భారత హాకీ స్టార్లు

Published on Wed, 03/19/2025 - 04:08

షట్లర్లు సైనా నెహ్వాల్‌–పారుపల్లి కశ్యప్, ఆర్చర్లు దీపిక కుమారి–అతాను దాస్, హాకీ క్రీడాకారులు మౌనిక–ఆకాశ్‌దీప్‌... ఇలా పెళ్లాడిన ప్లేయర్ల జాబితాలో కొత్తగా మహిళా డిఫెండర్‌ ఉదిత దుహాన్, పురుషుల ఫార్వర్డ్‌ మన్‌దీప్‌ సింగ్‌లు కూడా చేరనున్నారు. భారత ప్లేయర్ల పెళ్లి బాజా ఇప్పటికే మోగుతోంది. శుక్రవారం (21న) జరిగే వేడుకలో మన్‌దీప్‌–ఉదితలు వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు.   

జలంధర్‌: మైదానంలో గోల్స్‌ కోసం ప్రత్యర్థులతో పోరాడే భారత హాకీ ప్లేయర్లు మన్‌దీప్‌ సింగ్, ఉదిత దుహాన్‌లు కాసేపు పెనాల్టీ కార్నర్లు, పెనాల్టీ స్ట్రోక్‌లు పక్కనబెట్టి, చేతుల్లోని హాకీ స్టిక్‌లకు సెలవిచ్చి కళ్యాణ మాలలు పట్టుకునేందుకు సిద్ధమయ్యారు. జలంధర్‌ (పంజాబ్‌)కు చెందిన మన్‌దీప్‌... హిస్సార్‌ (హరియాణా) అమ్మాయి ఉదితతో కలిసి ఏడడుగులు నడువనున్నాడు. 

భారత హాకీకి రెండు కన్నుల్లాంటి పంజాబ్, హరియాణా రాష్ట్రాలకు చెందిన ప్లేయర్ల మధ్య ఈ నెల 21న అంగరంగ వైభవంగా వివాహ వేడుక జరుగనుంది. ఈ మేరకు ఇద్దరి ఇళ్లు, కళ్యాణశోభను సంతరించుకున్నాయి. వీళ్లిదరి పెళ్లికి సంబంధించిన ప్రి–వెడ్డింగ్‌ షూట్‌ ఫొటోల్ని సామాజిక సైట్లలో పోస్ట్‌ చేశారు. 27 ఏళ్ల ఉదిత 2017లో జాతీయ జట్టుకు ఎంపికైంది. డిఫెండర్‌గా 127 మ్యాచ్‌ల్లో కీలక పాత్ర పోషించింది. 

ప్రత్యర్థి స్ట్రయికర్లను గోల్స్‌ చేయకుండా నిరోధించే ఆమె 14 గోల్స్‌ కూడా చేసింది. 30 ఏళ్ల ఫార్వర్డ్‌ ప్లేయర్‌ మన్‌దీప్‌ 2013లో భారత్‌ తరఫున అంతర్జాతీయ హాకీలో ఆరంగేట్రం చేశాడు. 15 ఏళ్లుగా 260 మ్యాచ్‌లాడిన మన్‌దీప్‌ 120 గోల్స్‌తో సత్తాచాటుకున్నాడు. పంజాబ్‌ పోలీస్‌ శాఖలో అతను డీఎస్పీగా ఉన్నాడు. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన భారత జట్టులో మన్‌దీప్‌ సభ్యుడు కాగా... త్రుటిలో కాంస్యం కోల్పోయి నాలుగో స్థానంతో తృప్తి పడిన మహిళల జట్టులో ఉదిత ఉంది. 

పెళ్లికి ముందరి సంగీత్‌ కార్యక్రమం నేడు జరుగనుంది. భారత పురుషులు, మహిళా జట్ల ప్లేయర్లు ఈ వేడుకలో గానబజానాతో హడావుడి చేయనున్నారు. 21న ఉదయం 9 గంటలకు సిక్కు మత సంప్రదాయం ప్రకారం పెళ్లి జరుగనుంది. అనంతరం మరుసటి రోజు ఘనంగా రిసెప్షన్‌ (విందు)కు హాకీ, ఇతర క్రీడా ప్రముఖులు హాజరుకానున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)