Breaking News

రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన స్టార్ ఫుట్‌బాల‌ర్ నాని

Published on Mon, 12/09/2024 - 12:10

పోర్చుగీస్ స్టార్ ఫుట్‌బాలర్, మాంచెస్టర్ యునైటెడ్  మాజీ ఆటగాడు నాని రిటైర్మెంట్ ప్రకటించాడు. 32 ఏళ్ల నాని సోషల్ మీడియా వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించాడు. నాకు ఇష్టమైన క్రీడకు వీడ్కోలు చెప్పే సమయం అసన్నమైంది. ప్రొఫెషనల్ ప్లేయర్‌గా నా కెరీర్‌ను ముగించాలని నిర్ణయించుకున్నాను.

నా ఈ 20 ఏళ్ల అద్భుత ప్రయాణంలో ఎన్నో మరుపురాని జ్ఞాపకాలు ఉన్నాయి. నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ నేను ధన్యవాదాలు. నా కొత్త లక్ష్యాలపై దృష్టి సారించేందుకు ప్రయత్నిస్తాను. మళ్లీ మనం కలుద్దాం అని ఇన్‌స్టాగ్రామ్‌లో నాని రాసుకొచ్చాడు. కాగా నాని 2007 మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ తరపున తన కెరీర్‌ను ఆరంభించాడు. 

ఈ ప్రతిష్టాత్మక క్లబ్ తరపున 230 మ్యాచ్‌లు ఆడి 41 గోల్స్ చేశాడు. గోల్స్ స‌మ‌యంలో మ‌రో  పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు కీల‌క స‌హ‌చ‌రుడిగా నానికి పేరుంది. నాని త‌న  వాలెన్సియా, లాజియో, ఓర్లాండో సిటీ, వెనిజియా, మెల్‌బోర్న్ విక్టరీ  అదానా డెమిర్‌స్పోర్‌ల వంటి మొత్తం 10 క్ల‌బ్‌ల త‌ర‌పున ఆడాడు.

నాని త‌న జాతీయ జ‌ట్టు పోర్చుగ‌ల్ త‌ర‌పున 112 మ్యాచ్‌లు ఆడి 24 గోల్స్ చేశాడు. అదే విధంగా 2016లో యూరోపియన్ ఛాంపియన్‌షిప్ విజేత నిలిచిన పోర్చుగ‌ల్ జ‌ట్టులో అత‌డు స‌భ్యునిగా ఉన్నాడు.
చదవండి: ENG vs NZ: ఓటమి బాధలో ఉన్న న్యూజిలాండ్‌కు భారీ షాక్‌

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)