Breaking News

క్వార్టర్స్‌లో సింధు 

Published on Fri, 01/09/2026 - 05:55

కౌలాలంపూర్‌: మలేసియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 బ్యాడ్మింటన్‌ టోరీ్నలో భారత స్టార్‌ పీవీ సింధు క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 18వ ర్యాంకర్‌ సింధు 21–8, 21–13తో ప్రపంచ 9వ ర్యాంకర్‌ టొమోకా మియజకి (జపాన్‌)పై గెలిచింది. కేవలం 33 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సింధు ప్రత్యర్థికి ఏదశలోనూ పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. నేడు జరిగే క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 3వ ర్యాంకర్‌ అకానె యామగుచి (జపాన్‌)తో సింధు తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 14–12తో ఆధిక్యంలో ఉంది.  

లక్ష్య సేన్, ఆయుశ్‌ అవుట్‌ 
పురుషుల సింగిల్స్‌లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో ప్రపంచ 13వ ర్యాంకర్‌ లక్ష్య సేన్‌ 20–22, 15–21తో ప్రపంచ 18వ ర్యాంకర్‌ లీ చెయుక్‌ యియు (హాంకాంగ్‌) చేతిలో... ప్రపంచ 32వ ర్యాంకర్‌ ఆయుశ్‌ శెట్టి 18–21, 21–18, 12–21తో ప్రపంచ నంబర్‌వన్‌ షి యుకి (చైనా) చేతిలో ఓడిపోయారు. పురుషుల డబుల్స్‌లో సాతి్వక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి (భారత్‌) జోడీ క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సాతి్వక్‌–చిరాగ్‌ ద్వయం 21–18, 21–11తో జునైది ఆరిఫ్‌–రాయ్‌ కింగ్‌ యాప్‌ (మలేసియా) జంటను ఓడించింది. నేడు జరిగే క్వార్టర్‌ ఫైనల్లో ఫజర్‌ అల్ఫియాన్‌–షోహిబుల్‌ ఫిక్రీ (ఇండోనేసియా)లతో 
సాతి్వక్‌–చిరాగ్‌ తలపడతారు.    

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)