Breaking News

గెంటేస్తారన్న భ‌యం.. క‌ట్‌చేస్తే చ‌రిత్ర‌కు అడుగు దూరంలో!

Published on Fri, 06/05/2026 - 19:15

రెండు వారాల క్రితం.. మాయ చావ్లిన్‌స్కా ఒక క్వాలిఫ‌య‌ర్‌గా ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ ఆడేందుకు పారిస్‌కు చేరుకుంది. స్పాన్స‌ర్స్ ఎవ‌రూ లేక‌పోవ‌డంతో సొంత డ‌బ్బుల‌తోనే ఫ్రెంచ్ ఓపెన్ ఆడేందుకు వ‌చ్చింది. అయితే ఎవ‌రూ ఊహించ‌ని విధంగా క్వాలిఫ‌య‌ర్ రౌండ్‌లో విజ‌యం సాధించింది. ఆ త‌ర్వాత నాలుగో రౌండ్ వ‌ర‌కు చేరుకున్న ఆమె త‌న జీవితంలో ఇదే పెద్ద విజ‌యం అని భావించింది. కానీ క‌ట్‌చేస్తే ఇవాళ చ‌రిత్ర‌కు అడుగుదూరంలో నిలిచింది ఈ 24 ఏళ్ల పోలండ్ సంచ‌ల‌నం. శ‌నివారం ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ మిరా ఆండ్రీవాతో ఫైన‌ల్ మ్యాచ్ ఆడ‌నున్న నేప‌థ్యంలో మాయ చావ్లిన్‌స్కా త‌న అనుభ‌వాల‌ను పంచుకుంది.

ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో పోలండ్‌కు చెందిన క్వాలిఫ‌య‌ర్ 24 ఏళ్ల మాయ చావ్లిన్‌స్కా చ‌రిత్ర‌కు అడుగుదూరంలో ఉంది. ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో శ‌నివారం జ‌ర‌గనున్న మహిళ‌ల సింగిల్స్ ఫైన‌ల్లో చావ్లిన్‌స్కా రష్యాకు చెందిన మిరా ఆండ్రీవాను ఎదుర్కోనుంది. ఫైన‌ల్లో గెలిచి టైటిల్ సాధిస్తే మాత్రం బ్రిట‌న్ స్టార్ క్రీడాకారిణి ఎమ్మా రాడుకాను త‌ర్వాత క్వాలిఫ‌య‌ర్ హోదాలో మ‌హిళ‌ల సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ అందుకోనున్న క్రీడాకారిణిగా చావ్లిన్‌స్కా నిల‌వ‌నుంది. 

ఈ నేప‌థ్యంలో టైటిల్ అందుకునేందుకు అడుగు దూరంలో నిలిచిన చావ్లిన్‌స్కా టోర్నీ మ‌ధ్య‌లో త‌న‌కు ఎదురైన అనుభ‌వాల‌ను పంచుకుంది. 'ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో అడుగుపెట్టిన‌ప్పుడు స్పాన్స‌ర్లు ఎవ‌రు లేక‌పోవ‌డంతో సొంత డ‌బ్బులు ఖ‌ర్చు పెట్టుకొని హోటల్ రూంలో దిగాను. త‌న ద‌గ్గ‌ర చాలిన‌న్ని డ‌బ్బులు లేక‌పోవ‌డంతో టోర్నీ మ‌ధ్య‌లోనే హోట‌ల్ వాళ్లు బ‌య‌ట‌కు  గెంటేస్తారేమోన‌ని చాలా భ‌య‌ప‌డ్డాను. 

కానీ ఇవాళ అన్ని రౌండ్ల‌ను దాటుకొని ఫైన‌ల్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధ‌మ‌య్యాడు. టైటిల్ గెలుస్తానో లేదో తెలియ‌దు కానీ జీవితాన్ని మాత్రం గెలిచేశాను. టైటిల్ గెలిస్తే నా దేశానికి గొప్ప విజ‌య‌మ‌వుతుంది. ఈ టోర్నీ ద్వారా నాకు వ‌చ్చే ప్రైజ్‌మ‌నీతో క‌ష్టాలు తీరిపోనున్నాయి' అని మాయ చావ్లిన్‌స్కా ఎమోష‌న‌ల్‌గా చెప్పుకొచ్చింది. 

ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌కు ముందు త‌న ప్రొఫెష‌న‌ల్ కెరీర్ మొత్తం క‌లిపి చావ్లిన్‌స్కా సుమారు 864,000 మిలియ‌న్ డాల‌ర్లు (భార‌త క‌రెన్సీలో సుమారు రూ. 8.22 కోట్లు) సంపాదించింది. అయితే ఇప్పుడు ఫ్రెంచ్ ఓపెన్‌లో విజేత‌గా నిలిస్తే చావ్లిన్‌స్కా సుమారు మూడు రెట్లు అంటే రూ. 30 కోట్ల‌కు పైగా అందుకోనుంది. అదే ర‌న్న‌ర‌ప్‌గా నిలిస్తే రూ. 15 కోట్ల 41 ల‌క్ష‌లు తీసుకోనుంది.

చేతిపై ప‌చ్చ‌బొట్టు


ఇక మాయ చావ్లిన్‌స్కా ఎడ‌మ‌చేతిపై 'ఫ్రీ' అనే అక్ష‌రం ప‌చ్చ‌బొట్టుగా పొడిపించుకోవ‌డం ప్ర‌త్యేక ఆకర్ష‌ణగా నిలిచింది. అయితే ఆ ప‌చ్చ‌బొట్టు వెనుక ఉన్న కార‌ణాన్ని చెప్ప‌డానికి చావ్లిన్‌స్కా ఇష్ట‌ప‌డ‌లేదు. కానీ ఆమె చేతిపై ఉన్న ఫ్రీ అనే టాటూ ప‌దం ఇవాళ ఫ్రెంచ్ ఓపెన్ ఫైన‌ల్ చేర్చింద‌ని అభిమానులు విశ్వ‌సిస్తున్నారు.

చదవండి: అఫ్గానిస్తాన్‌కు షాక్‌.. గుడ్‌బై చెప్పనున్న ర‌షీద్ ఖాన్‌!

 

Videos

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)