Breaking News

మహిత్‌కు మరో స్వర్ణం

Published on Sun, 11/23/2025 - 03:21

న్యూఢిల్లీ: బధిరుల ఒలింపిక్స్‌ క్రీడల్లో భారత షూటర్ల జోరు కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటికే మూడు పతకాలు నెగ్గిన భారత షూటర్‌ మహిత్‌ సంధు తాజాగా నాలుగో పతకం ఖాతాలో వేసుకుంది. శనివారం మహిళల 50 మీటర్ల రైఫిల్‌ ‘త్రి’ పొజిషన్‌లో మహిత్‌ స్వర్ణ పతకంతో మెరిసింది. ఫైనల్లో మహిత్‌ 456 పాయింట్లతో అగ్ర స్థానంలో నిలిచింది. ఈ పోటీల్లో మహిత్‌కు ఇది రెండో స్వర్ణం కావడం విశేషం. 

దక్షిణ కొరియాకు చెందిన డైన్‌ జెంగ్‌ 453.5 పాయింంట్లతో రజతం దక్కించుకోగా... హంగేరి షూటర్‌ మిరా జుసన్నా బియాటోజ్‌కీ (438.6 పాయింట్లు) కాంస్యం నెగ్గింది. అంతకుముందు క్వాలిఫయింగ్‌ రౌండ్‌లో మహిత్‌ 585 పాయింట్లు సాధించి ప్రపంచ రికార్డుతో ఫైనల్లో అడుగుపెట్టింది. ఆమె నీలింగ్‌ పొజిషన్‌లో 194 పాయింట్లు, ప్రోన్‌లో 198 పాయింట్లు, స్టాండింగ్‌లో 193 పాయింట్లతో అదరగొట్టింది. 

గతంలో 576 పాయింట్లతో తన పేరిటే ఉన్న వరల్డ్‌ రికార్డును మహిత్‌ తిరగరాసింది. ఇదే విభాగంలో పోటీపడిన భారత మరో షూటర్‌ నటాషా జోషీ 417.1 పాయింట్లతో ఐదో స్థానానికి పరిమితమైంది. ఈ పోటీల్లో భారత షూటర్లు ఇప్పటి వరకు 14 పతకాలు (5 స్వర్ణాలు, 6 రజతాలు, 3 కాంస్యాలు) గెలుచుకున్నారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)