Breaking News

Nikhat Zareen: సాహస యాత్రలకు సిద్ధం: వరల్డ్‌ బాక్సింగ్‌ చాంపియన్‌

Published on Thu, 08/10/2023 - 11:53

భారత స్టార్‌ బాక్సర్‌, వరల్డ్‌ చాంపియన్‌ నిఖత్‌ జరీన్‌కు మహీంద్రా కంపెనీ స్పోర్ట్‌ యుటిలిటి వెహికిల్‌ను బహూకరించింది. తమ కంపెనీకి చెందిన ప్రఖ్యాత ఎస్‌యూవీ ‘థార్‌’ను బహుమతిగా అందించింది. మహీంద్ర ఎమర్జింగ్‌ బాక్సింగ్‌ ఐకాన్‌ విజేతగా నిలిచిన తెలంగాణ ముద్దుబిడ్డ నిఖత్‌కు థార్‌ను ప్రదానం చేసింది. 

మహీంద్రా కంపెనీ సౌత్‌ జోనల్‌ హెడ్‌ రాయ్‌, రీజినల్‌ సేల్స్‌ హెడ్‌ అభిషేక్‌, కొత్తగూడ మహీంద్రా వీవీసీ షోరూం ఎండీ వీవీ రాజేంద్ర ప్రసాద్‌ చేతుల మీదుగా నిఖత్‌కు ఎస్‌యూవీని అందజేశారు. ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌-2023లో విజేతగా నిలిచిన నిఖత్‌కు థార్‌ను గిఫ్ట్‌గా అందిస్తామని ఈ ఏడాది మార్చిలో ప్రకటించిన మహీంద్రా కంపెనీ.. తాజాగా ఆమెకు ఎస్‌యూవీ తాళాలను అందజేసింది. ఈ ఈవెంట్‌లో కంపెనీ ఉద్యోగులతో పాటు కస్టమర్లు కూడా పాల్గొన్నారు. నిఖత్‌ జరీన్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. 

ఇక తనకు ప్రతిష్టాత్మక మహీంద్ర ఎమర్జింగ్‌ బాక్సింగ్‌ ఐకాన్‌ అవార్డు రావడం పట్ల నిఖత్‌ జరీన్‌ సంతోషం వ్యక్తం చేసింది. ప్రస్తుతం తనకైతే డ్రైవింగ్‌ రాదని.. త్వరలోనే ‘థార్‌’తో తన ప్రయాణం మొదలుకానుందని పేర్కొంది. తన ప్యాషన్‌కు అనుగుణంగా ఈ ఎస్‌యూవీతో సాహసయాత్రలు చేస్తానంటూ చెప్పుకొచ్చింది.  


ప్రపంచ సీనియర్‌ మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో నిఖత్‌ జరీన్‌ (50 కేజీలు) ఈ ఏడాది మరోసారి చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. వరుసగా రెండో ఏడాది పసిడి సాధించి సత్తా చాటింది. ఢిల్లీలో జరిగిన ఫైనల్లో ఎన్గుయెన్‌ థిటామ్‌ను ఓడించి విజేతగా అవతరించి.. ప్రపంచ చాంపియన్‌షిప్‌ చరిత్రలో రెండు స్వర్ణాలు గెలిచిన రెండో భారత బాక్సర్‌గా నిలిచింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)