'భారత్‌లో అన్ని బ్యాటింగ్‌ పిచ్‌లే.. అందుకే ఇక్కడ ఆడలేకపోయారు'

Published on Fri, 08/09/2024 - 13:04

స్వ‌దేశంలో టీమిండియాతో జ‌రిగిన వ‌న్డే సిరీస్‌ను 2-0 తేడాతో శ్రీలంక సొంతం చేసుకుంది. భార‌త్‌పై వ‌న్డే సిరీస్‌ను కైవ‌సం చేసుకున్న లంకేయులు త‌మ 27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్ష‌ణ‌కు తెరిదించారు. ఈ సిరీస్‌లో శ్రీలంక జ‌ట్టు అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచింది.

ముఖ్యంగా లంక స్పిన్న‌ర్లు భార‌త బ్యాట‌ర్ల‌ను ముప్పు తిప్పులు పెట్టారు.  మూడు వ‌న్డేల్లో క‌లిపి ఆతిథ్య జ‌ట్టు స్పిన్న‌ర్లు ఏకంగా 27 వికెట్లు ప‌డ‌గొట్టారు. తొలి రెండు వ‌న్డేల్లో కాస్త ప‌ర్వాలేద‌న్పంచిన టీమిండియా.. మూడో వ‌న్డేలో మాత్రం పూర్తిగా తేలిపోయింది. 

కొలంబో వేదిక‌గా జ‌రిగిన ఆఖ‌రి వ‌న్డేలో భార‌త్  110 పరుగుల తేడాతో ప‌రాజ‌యం పాలైంది. ఈ నేప‌థ్యంలో శ్రీలంక స్పిన్నర్ మహేశ్ తీక్షణ భార‌త జ‌ట్టును ఉద్దేశించి కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. భార‌త్‌లో అన్నీ బ్యాటింగ్ పిచ్‌లే ఉంటాయ‌ని, త‌మ దేశంలో అలా ఉండ‌వ‌ని తీక్షణ తెలిపాడు.

"భార‌త్‌లో దాదాపుగా అన్ని పిచ్‌లు ప్లాట్‌గా ఉండి బ్యాటింగ్‌కు అనుకూలిస్తాయి. అంతేకాకుండా బౌండరీలు కూడా చాలా చిన్న‌గా ఉంటాయి. ఇటువంటి వికెట్‌పై భార‌త బ్యాట‌ర్లు బాగా అల‌వాటు ప‌డి ఉంటారు. అందుకే ఇక్క‌డ‌(శ్రీలంక‌)కు వ‌చ్చి కాస్త  ఇబ్బంది ప‌డ్డారు.

కొలంబోలోని ప్రేమ‌దాస వికెట్ ఎలా ఉంటుందో మాకు బాగా తెలుసు. మేము ఇక్కడ చాలా మ్యాచ్‌లు ఆడాము. కొంచెం ట‌ర్న్ ఉంటే చాలు మా జ‌ట్టులో నాణ్య‌మైన స్పిన్న‌ర్లు ఉన్నందున ప్ర‌త్య‌ర్ధి బ్యాట‌ర్ల‌ను క‌ట్ట‌డి చేయ‌వ‌చ్చు. 

దేశీవాళీ క్రికెట్‌లో కూడా మాకు ఇటువంటి పిచ్‌లే ఉంటాయి. కాబ‌ట్టి మా బ్యాట‌ర్ల‌కు ఇటువంటి వికెట్ల‌పై ఎలా ఆడాలో తెలుసు అని ఓ స్పోర్ట్స్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో థీక్షణ పేర్కొన్నాడు.
చదవండి: #Arshad Nadeem: కూలీ కొడుకు.. ఒక్కపూట తిండిలేక పస్తులు.. ఒలింపిక్‌ వీరుడిగా

Videos

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)