Breaking News

స్మరన్‌ సూపర్‌ సెంచరీ

Published on Sun, 08/18/2024 - 19:55

మహారాజా ట్రోఫీ కేఎస్‌సీఏ టీ20 టోర్నీలో ఇవాళ (ఆగస్ట్‌ 18) జరిగిన మ్యాచ్‌లో మైసూర్‌ వారియర్స్‌, గుల్బర్గా మిస్టిక్స్‌ జట్లు పోటీ పడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన మైసూర్‌ వారియర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేయగా.. సెంచరీ హీరో స్మరన్‌ (60 బంతుల్లో 104 నాటౌట్‌; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) చివరి బంతికి బౌండరీ బాది మిస్టిక్స్‌కు అద్భుత విజయాన్ని అందించాడు.

వారియర్స్‌ తరఫున కెప్టెన్‌ కరుణ్‌ నాయర్‌ మెరుపు అర్ద సెంచరీతో (35 బంతుల్లో 66; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగగా.. టీమిండియా తాజా మాజీ హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ కొడుకు సమిత్‌ ద్రవిడ్‌ ఓ మోస్తరు స్కోర్‌తో (24 బంతుల్లో 33; 4 ఫోర్లు, సిక్స్‌) రాణించాడు. 

ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన జగదీశ్‌ సుచిత్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌తో (12 బంతుల్లో 40 నాటౌట్‌; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకట్టుకున్నాడు. మిస్టిక్‌ బౌలర్లలో మోనిశ్‌ రెడ్డి, పృథ్వీ రాజ్‌ షెకావత్‌, యశోవర్దన్‌ తలో రెండు వికెట్లు.. విజయ్‌కుమార్‌, శరణ్‌ గౌడ్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

197 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మిస్టిక్స్‌.. 7 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. స్మరన్‌.. అనీశ్‌ (24), ఫైజాన్‌ ఖాన్‌ (18), ప్రవీణ్‌ దూబే (37) సహకారంతో మిస్టిక్స్‌ను విజయతీరాలకు చేర్చాడు.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)