Breaking News

7 వికెట్లతో చెల‌రేగిన మ‌హారాజ్‌.. పాక్ 333 ప‌రుగుల‌కు ఆలౌట్‌

Published on Tue, 10/21/2025 - 12:37

రావల్పిండి వేదిక‌గా పాకిస్తాన్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టులో సౌతాఫ్రికా స్టార్ స్పిన్న‌ర్ కేశ‌వ్ మ‌హారాజ్ బంతితో మ్యాజిక్ చేశాడు. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో మ‌హారాజ్ 7 వికెట్లతో చెల‌రేగాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్ 333 పరుగులకు ఆలౌటైంది. 259/5 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రెండో రోజును ఆటను ఆరంభించిన పాకిస్తాన్‌ అదనంగా 72 పరుగులు చేసి తమ ఇన్నింగ్స్‌ను ముగించింది.

259/5 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రెండో రోజును ఆటను ఆరంభించిన పాకిస్తాన్‌ అదనంగా 72 పరుగులు చేసి తమ ఇన్నింగ్స్‌ను ముగించింది. పాక్ బ్యాటర్లలో కెప్టెన్‌ షాన్‌ మసూద్‌ (87), ఓపెనర్‌ అబ్దుల్లా షఫీక్‌ (57), షకీల్‌(66) అర్ద సెంచరీలతో సత్తాచాటగా.. సల్మాన్ అలీ అఘా(45) రాణించారు.

స్టార్‌ ఆటగాళ్లు బాబర్‌ ఆజమ్‌ (16), మహ్మద్‌ రిజ్వాన్‌ (19) మరోసారి విఫలమయ్యారు. ప్రోటీస్ బౌలర్లలో మహారాజ్‌తో పాటు హర్మర్ రెండు, రబాడ ఓ వికెట్ సాధించారు. మహారాజ్‌కు ఇది ఓవరాల్‌గా 12వ టెస్టు వికెట్ హాల్ కావడం గమనార్హం.

తుది జ‌ట్లు
పాకిస్తాన్‌
అబ్దుల్లా షఫీక్, ఇమామ్‌ ఉల్‌ హాక్‌, షాన్ మసూద్ (కెప్టెన్‌), బాబర్ ఆజం, సౌద్ షకీల్, ముహమ్మద్ రిజ్వా (వికెట్ కీప‌ర్‌), సల్మాన్ అఘా, నోమన్ అలీ,సాజిద్ ఖాన్, షాహీన్ అఫ్రిది, ఆసిఫ్ అఫ్రిది

సౌతాఫ్రికా
ఐడెన్ మార్క్‌రామ్ (కెప్టెన్‌), ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, టోనీ డి జోర్జి, డెవాల్డ్ బ్రీవిస్, కైల్ వెర్రెయిన్ (వికెట్ కీప‌ర్‌), సెనురన్ ముత్తుసామి, మార్కో జాన్సెన్, సైమన్ హార్మర్, కేశవ్ మహారాజ్, కగిసో రబడ

చదవండి: Pro Kabaddi: 11 ఓటములు.. విసిగి పోయిన హెడ్ కోచ్‌! ఏమి చేశాడంటే?
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)