Breaking News

టీఎన్‌పీఎల్‌ 2023 విజేత లైకా కోవై కింగ్స్‌.. వరుసగా రెండోసారి

Published on Thu, 07/13/2023 - 12:52

నెలరోజుల పాటు క్రికెట్‌ ప్రేమికులను అలరించిన తమిళనాడు ప్రీమియర్‌(TNPL 2023) లీగ్‌లో లైకా కోవై కింగ్స్‌ విజేతగా నిలిచింది. బుధవారం రాత్రి జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో నెల్లయ్‌ రాయల్‌ కింగ్స్‌పై 104 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించిన లైకా కింగ్స్‌ వరుసగా రెండోసారి చాంపియన్‌గా నిలవడం విశేషం.

తొలుత బ్యాటింగ్‌ చేసిన లైకా కోవై కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోరు చేసింది. సురేశ్‌ కుమార్‌(33 బంతుల్లో 57 పరుగులు), ముకిలేష్‌(40 బంతుల్లో 51 నాటౌట్‌) నిలకడగా ఆడగా.. చివర్లో అతీక్‌ ఉర్‌ రెహమాన్‌(21 బంతుల్లోనే 50 పరుగులు) మెరుపులు మెరిపించాడు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెల్లయ్‌ రాయల్‌ కింగ్స్‌ 15 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది.

అరుణ్‌ కార్తిక్‌ 27 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. లక్ష్మేషా సుర్యప్రకాశ్‌ 22 పరుగులు చేశాడు. లైకా కోవై కింగ్స్‌ బౌలర్లలో జతదేవ్‌ సుబ్రమణ్యన్‌ నాలుగు వికెట్లు తీయగా.. కెప్టెన్‌ షారుక్‌ ఖాన్‌ మూడు, మణిమరన్‌ సిద్దార్థ్‌, గౌతమ్‌ కన్నన్‌, మహ్మద్‌లు తలా ఒక వికెట్‌ తీశారు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా జతదేవ్‌ సుబ్రమణ్యన్‌ నిలవగా.. ఆరెంజ్‌ క్యాప్‌ను నెల్లయ్‌ రాయల్‌ కింగ్స్‌ బ్యాటర్‌ అజితేశ్‌ గురుస్వామి(10 మ్యాచ్‌ల్లో 385 పరుగులు) గెలుచుకోగా.. పర్పుల్‌ క్యాప్‌ను లైకా కోవై కింగ్స్‌ కెప్టెన్‌ షారుక్‌ ఖాన్‌(9 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు) అందుకున్నాడు.

చదవండి: #CarlosAlcaraz: 'నాన్నను నిందించొద్దు.. ప్రేమతో అలా చేశాడు; నాకు ఒరిగేదేం లేదు!'

'సూపర్‌మ్యాన్‌' సిరాజ్‌.. కళ్లు చెదిరే క్యాచ్‌తో మెరిశాడు

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు