Breaking News

హార్దిక్‌ వాచ్‌ ధర ఆసియా కప్‌ ప్రైజ్‌మనీ కంటే 8 రెట్లు ఎక్కువ..!

Published on Tue, 09/09/2025 - 10:49

కొద్ది రోజుల కిందట ఆసియా కప్‌ 2025 ట్రైనింగ్ సెషన్‌లో భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ధరించిన "Richard Mille RM 27-04 Tourbillon" చేతి గడియారం (వాచ్‌) క్రికెట్‌ అభిమానులనే కాక యావత్‌ ప్రపంచాన్ని ఆకర్షించింది. ఈ వాచ్‌ విలువ రూ.20 కోట్లకు పైబడి ఉంటుంది. ఇది ఆసియా కప్‌ ప్రైజ్ మనీతో (రూ.2.6 కోట్లు) ఎనిమిది రెట్లు ఎక్కువ.

ఈ లిమిటెడ్ ఎడిషన్ టైమ్‌పీస్‌లు ప్రపంచవ్యాప్తంగా కేవలం 50 మాత్రమే తయారు చేయబడ్డాయి. ఈ లగ్జరీ చేతి గడియారం టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నదాల్‌ కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది.

ఈ టైమ్‌పీస్‌ ప్రత్యేకతలు ఏమిటంటే..
- 30 గ్రాముల బరువు మాత్రమే, స్ట్రాప్‌తో సహా
- 12,000 g’s వరకు షాక్‌ రెసిస్టెన్స్ ఉంటుంది, ఇది రికార్డు స్థాయి
- టెన్నిస్ రాకెట్ స్ట్రింగ్‌ల ప్రిన్సిపుల్ ఆధారంగా రూపొందించిన స్టీల్ మెష్
- TitaCarb® అనే అత్యాధునిక పాలిమర్‌తో తయారైన కేస్ 
- 38.5% కార్బన్ ఫైబర్ కలిగి ఉండి, అత్యధిక బలాన్ని కలిగిస్తుంది

కాగా, వాచ్‌ల పిచ్చి ఉన్న హార్దిక్‌ పాండ్యా గతంలో Richard Mille RM 27-04 Tourbillon కంటే చాలా రెట్లు ఖరీదైన Patek Philippe Nautilus Travel Time Blue Diamond వాచ్‌ను ధరించాడు. దీని విలువ రూ. 43.83 కోట్లు ఉంటుందని అంచనా. హార్దిక్‌ వద్ద రూ.7 కోట్ల విలువైన RM 27-02 వాచ్‌ కూడా ఉంది.

హార్దిక్‌ తర్వాత భారత క్రికెటర్లలో అత్యంత ఖరీదైన వాచ్‌ను విరాట్‌ కోహ్లి ధరించాడు. కోహ్లి ఓ సందర్భంలో రూ. 4.36 కోట్ల విలువైన Rolex Daytona Rainbow Everose Gold మోడల్‌ను ధరించాడు. 

క్రీడా ప్రపంచం మొత్తంలో అత్యంత ఖరీదైన వాచ్‌ను ధరించిన ఘనత బాక్సింగ్‌ దిగ్గజం ఫ్లాయిడ్‌ మెవెదర్‌ను దక్కుతుంది. మెవెదర్‌ ఓ సందర్భంలో Jacob & Co. Billionaire వాచ్‌ ధరించాడు. దీని విలువ రూ. 150 కోట్లు. దీన్ని 260 కారెట్ల డైమండ్లతో ప్రత్యేకంగా తయారు చేశారు.

కాగా, ఆసియా కప్‌లో భారత్‌ తమ తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 10న UAEతో ఆడుతుంది. సెప్టెంబర్ 14న పాకిస్తాన్‌తో హై-వోల్టేజ్ మ్యాచ్‌ జరగనుంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)