Breaking News

లక్నో సూపర్‌ జెయింట్స్‌లో కీలక పరిణామం.. అసిస్టెంట్‌ కోచ్‌పై వేటు

Published on Mon, 01/01/2024 - 19:06

ఐపీఎల్‌ ఫ్రాంచైజీ లక్నో సూపర్‌ జెయింట్స్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ జట్టు అసిస్టెంట్‌ కోచ్‌ విజయ్‌ దాహియాపై ఫ్రాంచైజీ యాజమాన్యం వేటు వేసింది. ఈ విషయాన్ని ఇరు పక్షాలు ధృవీకరించాయి. ఎల్‌ఎస్‌జీతో రెండేళ్ల బంధాన్ని తెంచుకుంటున్నట్లు దాహియా తన సోషల్‌మీడియా అకౌంట్‌ ద్వారా ప్రకటించగా.. లక్నో మేనేజ్‌మెంట్‌ దాహిదాకు ఆల్‌ ద బెస్ట్‌ చెప్పింది.

హెడ్‌ కోచ్‌గా జస్టిన్‌ లాంగర్‌ బాధ్యతలు చేపట్టాక లక్నో ఫ్రాంచైజీలో పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల గౌతమ్‌ గంభీర్‌ లక్నో మెంటార్షిప్‌ను వదులకుని తన హోం ఫ్రాంచైజీ అయిన కేకేఆర్‌కు వెళ్లిపోగా.. లాంగర్‌ పట్టుబట్టి శ్రీధరన్‌ శ్రీరామ్‌ను అసిస్టెంట్‌ కోచ్‌గా తన బృందంలో చేర్చుకున్నాడు. తాజాగా దాహియా కూడా ఫ్రాంచైజీని వీడటంతో జట్టులొ అంతర్గతంగా ఎదో జరుగుతుందని అంతా అనుకుంటున్నారు.

కాగా, కొన్ని రోజుల కిందట లక్నో యాజమాన్యం ఆండీ ఫ్లవర్‌ను హెడ్‌ కోచ్‌ పదవి నుంచి తొలగించి, ఆ స్థానంలో జస్టిన్‌ లాంగర్‌ను కూర్చోబెట్టింది. లాంగర్‌కు ఆసీస్‌ హెడ్‌ కోచ్‌గా మంచి ట్రాక్‌ రికార్డు ఉంది. దీంతో ఎల్‌ఎస్‌జీ యాజమాన్యం అతని కోసం భారీ మొత్తాన్ని వెచ్చించి అక్కున చేర్చుకుంది. ఎల్‌ఎస్‌జీతో జతకట్టినప్పటి నుంచి లాంగర్‌ తనదైన ముద్రను వేసుకుంటున్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌ 2024 వేలంలోనూ అతను చాలా కీలకంగా వ్యవహరించాడు.

ఈ వేలంలో లక్నో ఆరుగురు ఆటగాళ్లను కొనుగోలు చేసింది. దాహియా స్థానంలో కొత్త అసిస్టెంట్‌ కోచ్‌గా సురేశ్‌ రైనాను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మరి రైనా తన స్థాయికంటే చిన్నదైన అసిస్టెంట్‌ కోచ్‌ పదవి చేపడతాడో లేదో వేచి చూడాలి. మరోవైపు రైనాను గంభీర్‌ స్థానంలో లక్నో మెంటార్‌గా నియమిస్తారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

కాగా, లక్నో సూపర్‌ జెయింట్స్‌ 2022 సీజన్‌తో ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు సీజన్లలో ఆ జట్టు ఓ మోస్తరు ప్రదర్శనలు చేసి ఫైనల్‌ ఫోర్‌ వరకు చేరింది. కేఎల్‌ రాహుల్‌ నేతృత్వంలో ఈ జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్నప్పటికీ ఒక్కసారి కూడా టైటిల్‌ గెలవలేకపోయింది. మరోవైపు లక్నోతో పాటే ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన గుజరాత్‌ టైటాన్స్‌ ఓ సారి ఛాంపియన్‌గా, మరోసారి రన్నరప్‌గా నిలిచింది. 

లక్నో కోచింగ్‌ సిబ్బంది:

  • హెడ్‌కోచ్‌ : జస్టిన్‌ లంగర్‌
  • అసిస్టెంట్‌ కోచ్‌ : శ్రీధరన్‌ శ్రీరామ్‌
  • ఫాస్ట్‌ బౌలింగ్‌ కోచ్‌ : మోర్నీ మోర్కెల్‌
  • ఫీల్డింగ్‌ కోచ్‌ : జాంటీ రోడ్స్‌
  • స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌ : ప్రవీణ్‌ తాంబే
     

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)