Breaking News

ఎస్ఆర్‌హెచ్ చేతిలో చిత్తు.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి ల‌క్నో ఔట్‌

Published on Mon, 05/19/2025 - 23:29

ఐపీఎల్‌-2025లో ల‌క్నో సూపర్ జెయింట్స్ క‌థ ముగిసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఏక్నా స్టేడియం వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన కీల‌క మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ల‌క్నో ఓటమి పాలైంది. దీంతో ఈ ఏడాది సీజ‌న్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి పంత్ టీమ్ నిష్క్ర‌మించింది. ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన ల‌క్నో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 205 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది.

ల‌క్నో బ్యాట‌ర్ల‌లో మిచెల్ మార్ష్‌(39 బంతుల్లో 6 ఫోర్లు 4 సిక్స్‌ల‌తో 65), మార్‌క్ర‌మ్‌(38 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌ల‌తో 61) హాఫ్ సెంచ‌రీలతో రాణించ‌గా.. నికోల‌స్ పూరన్‌(26 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స‌ర్‌తో  45) మెరుపులు మెరిపించాడు. ఎస్ఆర్‌హెచ్ బౌల‌ర్ల‌లో ఇషాన్ మ‌లింగ రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. దూబే, హ‌ర్ష‌ల్ ప‌టేల్‌, నితీష్ కుమార్ రెడ్డి త‌లా వికెట్ సాధించారు.

అభిషేక్ శ‌ర్మ విధ్వంసం.. 
అనంత‌రం 206 ప‌రుగుల ల‌క్ష్యాన్ని స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ కేవ‌లం నాలుగు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 18.2 ఓవ‌ర్ల‌లో చేధించింది. ఎస్ఆర్‌హెచ్ బ్యాట‌ర్ల‌లో అభిషేక్ శ‌ర్మ‌(20 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌ల‌తో 59) విధ్వంస‌క‌ర హాఫ్ సెంచ‌రీతో చెల‌రేగ‌గా.. క్లాసెన్‌(47), ఇషాన్ కిష‌న్‌(35), మెండిస్‌(32) కీల‌క ఇన్నింగ్స్‌లు ఆడారు. ల‌క్నో బౌల‌ర్ల‌లో దిగ్వేష్ సింగ్ రెండు, విలియం ఓ రూర్క్ వికెట్ సాధించారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)