Breaking News

లక్నో జట్టులోకి యువ ఆటగాడు.. ఎవరీ సూర్యన్ష్?

Published on Fri, 05/19/2023 - 10:49

ఐపీఎల్‌-2023 సీజన్‌ మధ్య నుంచి లక్నో సూపర్‌ జెయింట్స్‌ పేసర్‌ జయదేవ్‌ ఉనద్కట్‌ గాయం కారణంగా వైదొలిగిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అతడి స్థానాన్ని ముంబైకు చెందిన యువ క్రికెటర్‌ సూర్యన్ష్ షెడ్జ్‌తో లక్నో భర్తీ చేసింది.  ఈ ఆల్‌రౌండర్‌ను కనీస ధర రూ. 20 లక్షలకు సొంతం చేసుకుంది. కాగా 20 ఏళ్ల సూర్యన్ష్ 2022-23 రంజీ సీజన్‌కు ఎంపిక చేసిన 16 మంది సభ్యుల ముంబై జట్టులో చోటు దక్కించుకున్నాడు.

అయితే ఈ టోర్నీలో అతడు కేవలం బెంచ్‌కే పరిమితమయ్యాడు. అదే విధంగా సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీకు కూడా ముంబై జట్టులో చోటు దక్కింది. ఇక్కడ కూడా సూర్యన్ష్‌కి తుది జట్టులో చోటు దక్కలేదు. ఇప్పటి వరకు అతడికి ముంబై సీనియర్‌ జట్టు తరపున ఆడే అవకాశం రాలేదు. కానీ గతేడాది డిసెంబర్‌లో జరిగిన బీసీసీఐ మెన్స్‌ అండర్‌ 25 స్టేట్‌-ఏ ట్రోఫీలో సూర్యన్ష్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.

ఈ టోర్నీలో 8 మ్యాచ్‌లు ఆడిన అతడు 184 పరుగులు చేశాడు. ఇక లక్నో విషయానికి వస్తే.. ప్లే ఆఫ్స్‌కు చేరేందుకు అడుగు దూరంలో నిలిచింది. మే 20న కేకేఆర్‌తో జరగనున్న మ్యాచ్‌లో విజయం సాధిస్తే.. సూపర్‌ జెయింట్స్‌ ఫ్లే ఆఫ్‌ బెర్త్‌ను ఖారారు చేసుకుంటుంది. కాగా లక్నో కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ గాయం కారణంగా ఈ ఏడాది సీజన్‌ మధ్యలో వైదొలిగిన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో ఆల్‌రౌండర్‌ కృనాల్‌ పాండ్యా జట్టును నడిపిస్తున్నాడు.
చదవండి: #Virat Kohli: కోహ్లి భారీ సిక్సర్‌.. పాపం నితీశ్‌రెడ్డి! డుప్లెసిస్‌ రియాక్షన్‌ అదుర్స్‌.. వీడియో వైరల్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)