Breaking News

కేఎల్‌ రాహుల్‌ను వదిలేయనున్న లక్నో.. మయాంక్‌ యాదవ్‌కు 14 కోట్లు..?

Published on Wed, 10/23/2024 - 10:55

ఐపీఎల్‌ 2025 సీజన్‌ మెగా వేలానికి ముందు లక్నో సూపర్‌ జెయింట్స్‌ యాజమాన్యం కేఎల్‌ రాహుల్‌ను రిలీజ్‌ చేయాలని డిసైడైనట్లు తెలుస్తుంది. ఫ్రాంచైజీ మేనేజ్‌మెంట్‌ రాహుల్‌ స్ట్రయిక్‌రేట్‌ పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. గత మూడు సీజన్లలో జట్టు పేలవ ప్రదర్శనకు రాహుల్‌ స్ట్రయిక్‌ రేట్‌ ప్రధాన కారణమని మేనేజ్‌మెంట్‌ భావిస్తుందట.

రాహుల్‌ స్థానంలో లక్నో కెప్టెన్సీ పగ్గాలు నికోలస్‌ పూరన్‌కు అప్పజెప్పాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఎల్‌ఎస్‌జీ యాజమాన్యం పూరన్‌తో పాటు మరో ఇద్దరిని రిటైన్‌ చేసుకోనుందని సమాచారం. రవి బిష్ణోయ్‌, మయాంక్‌ యాదవ్‌ల కోసం భారీ మొత్తం ఖర్చు చేయనున్నట్లు తెలుస్తుంది. మయాంక్‌కు పారితోషికం కింద దాదాపు రూ. 14 కోట్లు దక్కవచ్చని అంచనా. అన్‌క్యాప్డ్‌ ప్లేయర్ల కోటాలో ఆయుశ్‌ బదోని, మొహిసిన్‌ ఖాన్‌లను కూడా రిటైన్‌ చేసుకోనున్నట్లు సమాచారం.

కాగా, లక్నో సూపర్‌ జెయింట్స్‌ 2022 సీజన్‌తో ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మూడు సీజన్ల పాటు కేఎల్‌ రాహుల్‌ ఆ జట్టుకు నాయకత్వం వహించాడు. 2022, 2023 సీజన్లలో ప్లే ఆఫ్స్‌కు చేరిన లక్నో.. ఈ ఏడాది లీగ్‌ స్టేజ్‌లోనే ఇంటిముఖం పట్టింది. 

చదవండి: ఫాస్టెస్ట్‌ డబుల్‌ సెంచరీ.. 103 బంతుల్లో 27 ఫోర్లు, 7 సిక్సర్లు

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)