52 బంతుల్లో శతక్కొట్టిన లంక ఓపెనర్‌

Published on Tue, 07/09/2024 - 17:57

లంక ప్రీమియర్‌ లీగ్‌ 2024 ఎడిషన్‌లో మూడో సెంచరీ (టిమ్‌ సీఫర్ట్‌, కుశాల్‌ పెరీరా) నమోదైంది. క్యాండీ ఫాల్కన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో జాఫ్నా కింగ్స్‌ ఓపెనర్‌ పథుమ్‌ నిస్సంక సుడిగాలి శతకంతో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన జాఫ్నా.. నిస్సంక మెరుపు శతకంతో చెలరేగడంతో భారీ స్కోర్‌ చేసింది.

52 బంతుల్లోనే శతక్కొట్టిన నిస్సంక
నిస్సంక కేవలం 52 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఓవరాల్‌గా 59 బంతులు ఎదుర్కొన్న నిస్సంక 16 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 119 పరుగులు చేసి ఔటయ్యాడు. నిస్సంకతో పాటు రిలీ రొస్సో (18 బంతుల్లో 41; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా బ్యాట్‌ ఝులిపించడంతో జాఫ్నా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. జాఫ్నా ఇన్నింగ్స్‌లో నిస్సంక, రొస్సో మినహా చెప్పుకోదగ్గ స్కోర్లు ఎవరూ చేయలేదు. 

కుశాల్‌ మెండిస్‌ 26, అవిష్క ఫెర్నాండో 16, కెప్టెన్‌ చరిత​్‌ అసలంక 2, అజ్మతుల్లా 1, వనుజ సహన్‌ 0 పరుగులకే ఔటయ్యారు. క్యాండీ బౌలర్లలో షనక 3, దుష్మంత చమీరా, రమేశ్‌ మెండిస్‌ తలో 2 వికెట్లు పడగొట్టారు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనలో క్యాండీ కూడా ధాటిగానే ఇన్నింగ్స్‌ ప్రారంభించింది. ఆ జట్టు 12 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. దినేశ్‌ చండీమాల్‌ 22 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ (6 ఫోర్లు, 3 సిక్సర్లు) చేశాడు. ఆండ్రీ ఫ్లెచర్‌ (13), మొహమ్మద్‌ హరీస్‌ (25) ఔట్‌ కాగా.. చండీమాల్‌తో (32 బంతుల్లో 78; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) పాటు కమిందు మెండిస్‌ (16) క్రీజ్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో క్యాండీ గెలవాలంటే 48 బంతుల్లో 88 పరుగులు చేయాల్సి ఉంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)