Breaking News

LPL 2024: ఫాల్కన్స్‌ను గెలిపించిన షకన, మెండిస్‌.. కొలొంబో ఔట్‌

Published on Fri, 07/19/2024 - 15:26

లంక ప్రీమియర్‌ లీగ్‌ 2024 ఎడిషన్‌ నుంచి కొలొంబో స్ట్రయికర్స్‌ నిష్క్రమించింది. నిన్న (జులై 18) క్యాండీ ఫాల్కన్స్‌తో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో  ఈ జట్టు 2 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసి 159 పరుగులు చేసిన కొలొంబో.. స్వల్ప స్కోర్‌ను కాపాడుకోవడంలో విఫలమైంది. కమిందు మెండిస్‌ (54), దుసన్‌ షనక (39) అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి ఫాల్కన్స్‌ను గెలిపించారు.

రాణించిన సమరవిక్రమ
సమరవిక్రమ (62) అర్ద సెంచరీతో రాణించడంతో కొలొంబో గౌరవప్రదమైన స్కోర్‌ చేయగలిగింది. కొలొంబో ఇన్నింగ్స్‌లో గుర్బాజ్‌ (30), వెల్లలగే (28) ఓ మోస్తరు స్కోర్లు చేయగలిగారు. ఫాల్కన్స్‌ బౌలర్లలో హస్నైన్‌ 3, హసరంగ 2, ఏంజెలో మాథ్యూస్‌, షనక తలో వికెట్‌ పడగొట్టారు.

160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఫాల్కన్స్‌.. కమిందు మెండిస్‌, షనక సత్తా చాటడంతో 18.4 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. కొలొంబో బౌలర్లలో బినర ఫెర్నాండో, మతీష పతిరణ తలో 3, ఇషిత విజేసుందర, షాదాబ్‌ ఖాన్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

ఈ మ్యాచ్‌లో గెలుపొందిన ఫాల్కన్స్‌.. రేపు జరుగబోయే ఎలిమినేటర్‌ 2లో జాఫ్నా కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు జులై 21న జరిగే ఫైనల్లో గాలే మార్వెల్స్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)