అలెక్స్‌ హేల్స్‌ విధ్వంసం

Published on Thu, 07/11/2024 - 16:14

లంక ప్రీమియర్‌ లీగ్‌ 2024 ఎడిషన్‌లో గాలే మార్వెల్స్‌ నాలుగో విజయం సాధించింది. నిన్న (జులై 10) జరిగిన మ్యాచ్‌లో మార్వెల్స్‌.. క్యాండీ ఫాల్కన్స్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఫాల్కన్స్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. 

ఆండ్రీ ఫ్లెచర్‌ (43 బంతుల్లో 69; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), చండీమల్‌ (14 బంతుల్లో 32; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), ఏంజెలో మాథ్యూస్‌ (15 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), రమేశ్‌ మెండిస్‌ (14 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మార్వెల్స్‌ బౌలర్లలో ప్రభాత్‌ జయసూర్య 3, ప్రిటోరియస్‌ 2, ఉడాన, తీక్షణ, నదీశన్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

హేల్స్‌ విధ్వంసం​
188 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మార్వెల్స్‌.. అలెక్స్‌ హేల్స్‌ (55 బంతుల్లో 86 నాటౌట్‌; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), భానుక రాజపక్స (26 బంతుల్లో 46 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరవిహారం చేయడంతో 19.2 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. 

మార్వెల్స్‌ ఇన్నింగ్స్‌లో డిక్వెల్లా 25, టిమ్‌ సీఫర్ట్‌ 16 పరుగులు చేసి ఔటయ్యారు. ఈ మ్యాచ్‌లో ఫాల్కన్స్‌ ఏకంగా ఏడుగురు బౌలర్లను ప్రయోగించినా ఉపయోగం లేకుండా పోయింది. హసరంగ, ఫ్లెచర్‌ మాత్రం తలో వికెట్‌ దక్కించుకున్నారు. 

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)