వరుసగా రెండో మ్యాచ్‌లో ఇరగదీసిన హసరంగ.. బ్యాట్‌తో విధ్వంసం, బంతితో మ్యాజిక్‌

Published on Tue, 08/08/2023 - 19:21

లంక ప్రీమియర్‌ లీగ్‌ 2023 ఎడిషన్‌లో బి లవ్‌ క్యాండీ కెప్టెన్‌ వనిందు హసరంగ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. లీగ్‌లో భాగంగా ఆగస్ట్‌ 5న జాఫ్నా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో (4-0-9-3, 22 బంతుల్లో 52 నాటౌట్‌; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అదరగొట్టిన హసరంగ.. ఇవాళ (ఆగస్ట్‌ 8) గాలే టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అదే స్థాయిలో రెచ్చిపోయాడు.

తొలుత బ్యాట్‌తో విధ్వంసం (27 బంతుల్లో 64; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) సృష్టించిన హసరంగ.. ఆతర్వాత బంతితో (3.4-0-17-4) తనదైన స్టయిల్‌లో మ్యాజిక్‌ చేశాడు. హసరంగ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఇరగదీయడంతో గాలేపై క్యాండీ 89 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన క్యాండీ.. హసరంగ, ఫకర్‌ జమాన్‌ (35 బంతుల్లో 45; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ఏంజెలో మాథ్యూస్‌ (23 బంతుల్లో 40; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), చండీమల్‌ (17 బంతుల్లో 25; 3 ఫోర్లు, సిక్స్‌), మహ్మద్‌ హరీస్‌ (14 బంతుల్లో 17; 3 ఫోర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. గాలే బౌలర్లలో లహిరు సమరకూన్‌ 2 వికెట్లు పడగొట్టగా.. కసున్‌ రజిత, నగరవ, షంషి తలో వికెట్‌ దక్కించుకున్నారు. 

అనంతరం 204 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గాలే.. హసరంగ, నువాన్‌ ప్రదీప్‌ (3-0-21-3), ముజీబ్‌ (4-0-26-2), దుష్మంత చమీర (3-0-17-1) ధాటికి 16.4 ఓవర్లలో 114 పరుగులు మాత్రమే చేసి చాపచుట్టేసింది. గాలే ఇన్నింగ్స్‌లో లహిరు సమరకూన్‌ (36) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. లసిత్‌ క్రూస్‌పుల్లే (27), అషాన్‌ ప్రియజన్‌ (25), షకీబ్‌ అల్‌ హసన్‌ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.

Videos

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)