Breaking News

శివాలెత్తిన గప్తిల్‌.. ఒకే ఓవర్‌లో..!

Published on Wed, 10/02/2024 - 12:33

లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌ 2024లో భాగంగా మణిపాల్‌ టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సథరన్‌ సూపర్‌ స్టార్స్‌ ఆటగాడు మార్టిన్‌ గప్తిల్‌ విశ్వరూపం ప్రదర్శించాడు. ఈ మ్యాచ్‌లో గప్తిల్‌..  డేనియల్‌ క్రిస్టియన్‌ వేసిన ఓ ఓవర్‌లో ఏకంగా 30 పరుగులు పిండుకున్నాడు. ఇందులో నాలుగు సిక్సర్లు, ఓ బౌండరీ ఉన్నాయి. ఈ మ్యాచ్‌ మొత్తంలో 29 బంతులు ఎదుర్కొన్న గప్తిల్‌ 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 68 పరుగులు చేశారు. 

గప్తిల్‌ శివాలెత్తిపోవడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన సథరన్‌ సూపర్‌ స్టార్స్‌ 15 ఓవర్లలో (వర్షం కారణంగా 20 ఓవర్ల మ్యాచ్‌ను 15 ఓవర్లకు కుదించారు) 7 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. సథరన్‌ సూపర్‌ స్టార్స్‌ ఇన్నింగ్స్‌లో గోస్వామి 18, మసకద్జ 1, చతురంగ డిసిల్వ 26, చిరాగ్‌ గాంధీ 36, పవన్‌ నేగి 8, జెసల్‌ కరియా 1, చిగుంబర 20 (నాటౌట్‌), సుబోత్‌ భాటి 1 (నాటౌట్‌) పరుగు చేశారు. మణిపాల్‌ టైగర్స్‌ బౌలర్లలో హర్భజన్‌ సింగ్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. అనురీత్‌ సింగ్‌, పియెనార్‌, రాహుల్‌ శుక్లా, ఏంజెలో పెరీరా తలో వికెట్‌ దక్కించుకున్నారు.

195 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టైగర్స్‌.. హమీద్‌ హసన్‌ (3/20), అబ్దుర్‌ రజాక్‌ (2/30), మోను కుమార్‌ (2/44), జెసల్‌ కరియా (2/29), పవన్‌ నేగి (1/0) ధాటికి 13.1 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. టైగర్స్‌ ఇన్నింగ్స్‌లో ఉతప్ప 17, అసేల గుణరత్నే 22, తిసార పెరీరా 37, అనురీత్‌ సింగ్‌ 10, హర్భజన్‌ సింగ్‌ 11, ఏంజెలో పెరీరా 5 పరుగులు చేయగా.. సౌరభ్‌ తివారి, అమిత్‌ వర్మ, పియెనార్‌ డకౌట్లు అయ్యారు. ఈ మ్యాచ్‌లో గెలుపుతో సథరన్‌ సూపర్‌ స్టార్స్‌ ప్రస్తుత ఎల్‌ఎల్‌సీ ఎడిషన్‌లో వరుసగా నాలుగో విజయాన్ని సొంతం చేసుకుంది.టైగర్స్‌ ఇంకా బోణి కొట్టాల్సి ఉంది. 

చదవండి: భార‌త్‌కు బిగ్ షాక్‌.. ఆసీస్ సిరీస్‌కూ స్టార్ ప్లేయ‌ర్ దూరం!

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు