Breaking News

చెలరేగిన మిస్బా, అఫ్రిది.. వరల్డ్‌ జెయింట్స్‌ను చిత్తు చేసిన ఆసియా సింహాలు

Published on Tue, 03/14/2023 - 11:23

లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌-2023లో భాగంగా వరల్డ్‌ జెయింట్స్‌తో నిన్న (మార్చి 13) జరిగిన మ్యాచ్‌లో ఆసియా సింహాలు రెచ్చిపోయాయి. వర్షం కారణంగా 10 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో తొలుత లయన్స్‌ బ్యాటర్లు, ఆతర్వాత బౌలర్లు విజృంభించారు. ఫలితంగా ఆ జట్టు 35 పరుగుల తేడాతో వరల్డ్‌ జెయింట్స్‌ను చిత్తు చేసింది.

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసియా లయన్స్‌ 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. తిలకరత్నే దిల్షన్‌ (24 బంతుల్లో 32 నాటౌట్‌; 3 ఫోర్లు, సిక్స్‌), మిస్బా ఉల్‌ హాక్‌ (19 బంతుల్లో 44 నాటౌట్‌; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) జెయింట్స్‌ బౌలర్లను చీల్చిచెండాడారు. తరంగ (1), తిసార పెరీరా (10), షాహిద్‌ అఫ్రిది (2) విఫలం​కాగా.. రికార్డో పావెల్‌, క్రిస్‌ గేల్‌, పాల్‌ కాలింగ్‌వుడ్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆసియా లయన్స్‌.. 10 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 64 పరుగులకు మాత్రమే పరిమితమై లీగ్‌లో తొలి ఓటమిని నమోదు చేసింది. లెండిల్‌ సిమన్స్‌ (14), షేన్‌ వాట్సన్‌ (3), ఆరోన్‌ ఫించ్‌ (2), రికార్డో పావెల్‌ (0) విఫలం కాగా.. క్రిస్‌ గేల్‌  (16 బంతుల్లో 23; 3 సిక్సర్లు) ఒక్కడే కాస్త పర్వాలేదనిపించాడు.

ఆసియా లయన్స్‌ బౌలర్లలో షాహిద్‌ అఫ్రిది (2-0-11-2), సోహైల్‌ తన్వీర్‌ (2-0-9-1) రాణించగా.. అబ్దుర్‌ రజాక్‌ (2-1-2-2) అదరగొట్టాడు. లీగ్‌లో భాగంగా ఇవాళ (మార్చి 14) ఆసియా లయన్స్‌, ఇండియా మహరాజాస్‌లో తలపడనుంది.

కాగా, లీగ్‌లో ఇప్పటివరకు జరిగిన 3 మ్యాచ్‌ల్లో రెండింటిలో ఆసియా లయన్స్‌, ఒక మ్యాచ్‌లో వరల్డ్‌ జెయింట్స్‌ విజయం సాధించగా.. ఇండియా మహరాజాస్‌ ఆడిన 2 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. లీగ్‌ తొలి మ్యాచ్‌లో ఆసియా లయన్స్‌ చేతిలో ఖంగుతిన్న (9 పరుగుల తేడాతో ఓటమి) మహరాజాస్‌.. రెండో మ్యాచ్‌లో వరల్డ్‌ జెయింట్స్‌ చేతిలో (2 పరుగుల తేడాతో ఓటమి) ఓటమిపాలయ్యారు. మహరాజాస్‌ ఓడిన రెండు మ్యాచ్‌ల్లో ఆ జట్టు కెప్టెన్‌ గౌతమ్‌ గంభీర్‌ హాఫ్‌ సెంచరీలు చేసి ఆకట్టుకున్నాడు. 

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)