Breaking News

ఐపీఎల్‌ ‘హిట్‌’ షోకు తెలుగు క్రికెటర్లు రెడీ!

Published on Fri, 03/22/2024 - 11:42

ఐపీఎల్‌ 2024 సీజన్‌లో సత్తా చాటేందుకు తెలుగు రాష్ట్రాల క్రికెటర్లు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ సీజన్‌ వేలంలో మొత్తం 11 మంది పాల్గొనగా.. ఆరుగురు క్రికెటర్లు వివిధ జట్లకు ఎంపికయ్యారు. 

  • గుంటూరుకు చెందిన షేక్‌ రషీద్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఆడుతుండగా..
  • విశాఖకు చెందిన కాకి నితీశ్‌ కుమార్‌ రెడ్డి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు..
  • విశాఖకు చెందిన కోన శ్రీకర్‌ భరత్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు..
  • హైదరాబాద్‌కు చెందిన మొహమ్మద్‌ రియాజ్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు..
  • హైదరాబాద్‌కే చెందిన తిలక్‌ వర్మ ముంబై ఇండియన్స్‌కు..
  • హైదరాబాద్‌కే చెందిన అరవెల్లి అవినీశ్ రావు చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఎంపికయ్యారు.

తెలుగోళ్ల సత్తా చాటడానికి సిద్ధం అని స్టార్‌ స్పోర్ట్స్‌ తెలుగు ఛానల్‌ ఓ ప్రత్యేక పోస్టర్‌ విడుదల చేసి తెలుగు వారియర్స్‌కు శుభాంకాంక్షలు తెలిపింది. పై పేర్కొన్న ఆరుగురే కాక తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న మరో ఇద్దరు కూడా ఈ సీజన్‌ ఐపీఎల్‌లో ఆడుతున్నారు.  

ప్రస్తుతం ఆంధ్ర జట్టుకు సారథ్యం వహిస్తున్న రికీ భుయ్‌ (మధ్యప్రదేశ్‌) ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనుండగా.. హైదరాబాద్‌ రంజీ జట్టుకు ఆడుతున్న తనయ్‌ త్యాగరాజన్‌ (బెంగళూరు) పంజాబ్‌ కింగ్స్‌కు ఎంపికయ్యారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎనిమిది మంది క్రికెటర్లు ఐపీఎల్‌ 17వ ఎడిషన్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 

ఇదిలా ఉంటే, ఐపీఎల్‌ 2024 సీజన్‌ ఇవాల్లి (మార్చి 22) నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. చెన్నైలోని చెపాక్‌ స్టేడియం వేదికగా జరుగనున్న సీజన్‌ తొలి మ్యాచ్‌లో ఫైవ్‌ టైమ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌ (సీఎస్‌కే), ఇప్పటివరకు ఒక్క టైటిల్‌ కూడా గెలవని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానుంది. 

తుది జట్లు (అంచనా):
సీఎస్‌కే: రుతురాజ్‌ గైక్వాడ్‌ (కెప్టెన్‌), రచిన్‌ రవీంద్ర, అజింక్య రహానే, డారిల్‌ మిచెల్‌, శివమ్‌ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్‌ ధోని (వికెట్‌కీపర్‌), శార్దూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చాహర్‌, మహీశ్‌ తీక్షణ, ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌

ఆర్సీబీ: విరాట్‌ కోహ్లి, ఫాఫ్‌ డుప్లెసిస్‌ (కెప్టెన్‌), రజత్‌ పాటిదార్‌, కెమరూన్‌ గ్రీన్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, దినేశ్‌ కా​ర్తీక్‌ (వికెట్‌కీపర్‌), అనూజ్‌ రావత్‌, అల్జరీ జోసఫ్‌, సిరాజ్‌, కర్ణ్‌ శర్మ, ఆకాశ్‌దీప్‌
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)