Breaking News

ఐపీఎల్‌ 2024 అవార్డు విన్నర్లు వీరే..!

Published on Mon, 05/27/2024 - 13:25

ఐపీఎల్‌ 2024 సీజన్‌ నిన్నటితో (మే 26) ముగిసింది. ఫైనల్లో కేకేఆర్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి విజేతగా ఆవిర్భవించింది. ఐపీఎల్‌లో కేకేఆర్‌కు ఇది మూడో టైటిల్‌. శ్రేయస్‌ అయ్యర్‌ కేకేఆర్‌కు పదేళ్ల నిరీక్షణ అనంతరం మరో టైటిల్‌ను అందించాడు.

కేకేఆర్‌ పేసర్‌ స్టార్క్‌ ఫైనల్లో అద్భుతమైన గణంకాలతో సత్తా చాటి కేకేఆర్‌ గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. సీజన్‌ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన సునీల్‌ నరైన్‌ మూడోసారి మోస్ట్‌ వ్యాల్యుబుల్‌ ప్లేయర్‌ అవార్డును గెలుచుకున్నాడు. 

అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా విరాట్‌.. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా హర్షల్‌ ఆరెంజ్‌, పర్పుల్‌ క్యాప్‌లను అందుకున్నారు. మరికొందరు ఆటగాళ్లు వివిధ విభాగాల్లో అవార్డులు గెలుచుకున్నారు.  

ఐపీఎల్‌ 2024 ఛాంపియన్స్‌- కేకేఆర్‌

రన్నరప్‌- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌

ఆరెంజ్‌ క్యాప్‌ (అత్యధిక పరుగులు)- విరాట్‌ కోహ్లి (ఆర్సీబీ, 15 మ్యాచ్‌ల్లో 741 పరుగులు)

పర్పుల్‌ క్యాప్‌ (అత్యధిక వికెట్లు)- హర్షల్‌ పటేల్‌ (పంజాబ్‌, 14 మ్యాచ్‌ల్లో 24 వికెట్లు)

మోస్ట్‌ వ్యాల్యుబుల్‌ ప్లేయర్‌- సునీల్‌ నరైన్‌ (కేకేఆర్‌, 14 మ్యాచ్‌ల్లో 488 పరుగులు, 17 వికెట్లు)

ఎమర్జింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద సీజన్‌- నితీశ్‌ కుమార్‌ రెడ్డి (సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌)

ఫైనల్లో ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌- మిచెల్‌ స్టార్క్‌ (కేకేఆర్‌, 3-0-14-2)

ఎలెక్ట్రిక్‌ స్ట్రయికర్‌ ఆఫ్‌ ద సీజన్‌- జేక్‌ ఫ్రేసర్‌ మెక్‌గుర్క్‌ (ఢిల్లీ)

గేమ్‌ ఛేంజర్‌ ఆఫ్‌ ద సీజన్‌- సునీల్‌ నరైన్‌ (కేకేఆర్‌)

పర్ఫెక్ట్‌ క్యాచ్‌ ఆఫ్‌ ద సీజన్‌- రమణ్‌దీప్‌ సింగ్‌ (కేకేఆర్‌)

ఫెయిర్‌ ప్లే అవార్డు- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌

విన్నర్‌ ప్రైజ్‌మనీ- రూ. 20 కోట్లు (కేకేఆర్‌)

రన్నరప్‌ ప్రైజ్‌మనీ- రూ. 12.5 కోట్లు (సన్‌రైజర్స్‌)

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)