Breaking News

2024లో క్రికెట్‌ జాతర.. సౌతాఫ్రికా టీ20 లీగ్‌తో మొదలుకుని..!

Published on Tue, 01/02/2024 - 14:50

2024లో క్రికెట్‌ జాతర జరుగనుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో క్రికెట్‌ లీగ్‌ల మోత మోగనుంది. జనవరి 9 నుంచి మొదలయ్యే సౌతాఫ్రికా టీ20 లీగ్‌తో ఈ ఏడాది క్రికెట్‌ సంబురాలు ప్రారంభమవుతాయి. ఇదే ఏడాది కరీబియన్‌ దీవులు, యూఎస్‌ఏ వేదికలుగా టీ20 ప్రపంచకప్‌ కూడా జరుగనుంది. ఈ మెగా టోర్నీ జూన్‌ 4 నుంచి 30వ తేదీ వరకు జరుగుతుంది. 

దీనికి ముందు భారత్‌లో క్రికెట్‌ మహాసంగ్రామం అయిన ఐపీఎల్‌ మొదలవుతుంది. ఈ లీగ్‌కు సంబంధించి తేదీలు అధికారికంగా ఖరారు కానప్పటికీ.. మార్చి 23-మే 26 మధ్యలో ఈ లీగ్‌ జరుగుతుందని తెలుస్తుంది. 

వీటితో పాటు ఈ ఏడాది ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20 (దుబాయ్‌), బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌, పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌, టీ20 వైటాలిటీ బ్లాస్ట్‌ (ఇంగ్లండ్‌), ద హండ్రెడ్‌ లీగ్‌ (ఇంగ్లండ్‌), కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (వెస్టిండీస్‌), టీ10 లీగ్‌ (అబుదాబీ), బిగ్‌బాష్‌ లీగ్‌ (ఆస్ట్రేలియా), లంక ప్రీమియర్‌ లీగ్‌ (శ్రీలంక), మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ (యూఎస్‌ఏ), సూపర్‌ స్మాష్‌ (న్యూజిలాండ్‌), గ్లోబల్‌ టీ20 కెనడా (కెనడా), జింబాబ్వే ఆఫ్రో టీ10 లీగ్‌ (ఆఫ్రికా) తదితర లీగ్‌లు జరుగనున్నాయి.

మొత్తంగా ఏడాది పొడవునా 15 క్రికెట్‌ లీగ్‌లు జరుగనున్నాయి. వీటిలో కొన్నింటికి సంబంధించిన షెడ్యూల్‌ విడుదల కావాల్సి ఉంది. ఇవే కాక ఈ ఏడాది పలు దేశీయ లీగ్‌లు కూడా జరుగుతాయి. మొత్తంగా ఏడాది పొడవునా అభిమానులకు క్రికెట్‌ కనువిందు చేయనుంది. 

వరస క్రమంలో ఈ ఏడాది జరుగబోయే వివిధ క్రికెట్‌ లీగ్‌లు..

  • సౌతాఫ్రికా టీ20 లీగ్‌- జనవరి 9 నుంచి ఫిబ్రవరి 10
  • ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20- జనవరి 19 నుంచి ఫిబ్రవరి 17
  • బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌- జనవరి 19 నుంచి మార్చి 1
  • పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌- ఫిబ్రవరి 13 నుంచి మార్చి 19
  • ఐపీఎల్‌- మార్చి 23 నుంచి మే 26 (అంచనా)
  • వైటాలిటీ బ్లాస్ట్‌- మే 30 నుంచి సెప్టెంబర్‌ 14
  • టీ20 వరల్డ్‌కప్‌- జూన్‌ 4 నుంచి 30
  • ద హండ్రెడ్‌- ఆగస్ట్‌
  • కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌- ఆగస్ట్‌-సెప్టెంబర్‌
  • టీ10 లీగ్‌- అక్టోబర్‌
  • బిగ్‌బాష్‌ లీగ్‌-డిసెంబర్‌-జనవరి

షెడ్యూల్‌ ఖరారు కాని లీగ్‌లు..

  • లంక ప్రీమియర్‌ లీగ్‌ (శ్రీలంక), 
  • మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ (యూఎస్‌ఏ), 
  • సూపర్‌ స్మాష్‌ (న్యూజిలాండ్‌), 
  • గ్లోబల్‌ టీ20 కెనడా (కెనడా), 
  • జింబాబ్వే ఆఫ్రో టీ10 లీగ్‌ (ఆఫ్రికా) 


 
 

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)