Breaking News

యూరో కప్‌ విజేతగా స్పెయిన్‌.. ప్రైజ్‌ మనీ ఎన్ని వందల కోట్లంటే?

Published on Mon, 07/15/2024 - 11:58

దాదాపు నెల రోజుల పాటు ఫుట్‌బాల్‌ అభిమానులను ఉర్రూతలూగించిన యూరో కప్‌-2024కు ఎండ్‌ కార్డ్‌ పడింది. ఆదివారం రాత్రి స్పెయిన్‌- ఇంగ్లండ్‌ ఫైనల్‌ మ్యాచ్‌తో ఈ టోర్నీ ముగిసింది. యూరోకప్‌ విజేతగా స్పెయిన్‌ నిలిచింది.

ఫైనల్లో 2-1 తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించిన స్పెయిన్‌.. నాలుగో సారి టైటిల్‌ను ముద్దాడింది. ఈ క్రమంలో విజేత స్పెయిన్‌ ప్రైజ్‌ మనీ ఎంత? రన్నరప్‌ ఇంగ్లండ్‌కు ఎంత దక్కుతుంది? ప్లేయర్‌ ఆఫ్‌ది టోర్నీ ఎవరన్న ఆంశాలపై ఓ లుక్కేద్దాం.

విజేత స్పెయిన్‌కు ఎన్ని కోట్లంటే?
యూరో కప్‌ విజేత స్పెయిన్‌కు ప్రైజ్‌ మనీ రూపంలో  మొత్తం 30.4 మిలియన్‌ డాలర్లు అందనుంది. అంటే భారత కరెన్సీలో సుమారుగా రూ. 253 కోట్ల ప్రైజ్‌ మనీ స్పెయిన్‌కు దక్కింది.

 అన్ని మ్యాచ్‌ల్లో గెలిచి ఛాంపియన్స్‌గా నిలిచినందుకు బోనస్‌+ గ్రూప్ స్టేజ్ విజయాలు+  క్వార్టర్-ఫైనల్ + సెమీ-ఫైనల్+ ఫైనల్+  టోర్నీలో పాల్గోనే రుసుము మొత్తం కలిపే రూ. 253 కోట్ల నగదు బహుమతిగా స్పెయిన్‌కు లభించనుంది.

రన్నరప్‌ ఇంగ్లండ్‌కు ఎంతంటే?
రన్నరప్‌ ఇంగ్లండ్‌కు  ప్రైజ్‌ మనీ రూపంలో  మొత్తం 27.25మిలియన్‌ డాలర్లు అందనుంది. అంటే భారత కరెన్సీలో సుమారుగా రూ.227 కోట్ల ప్రైజ్‌ మనీ ఇంగ్లండ్‌కు దక్కింది. 

గ్రూప్ స్టేజ్ విజయాలు+ క్వార్టర్-ఫైనల్ + సెమీ-ఫైనల్+ టోర్నీలో పాల్గోనే రుసుము+ రౌండ్‌ 16  మొత్తం ప్రైజ్‌మనీ కలిపి ఇంగ్లండ్‌కు రూ.227 కోట్ల నగదు బహుమతిగా అందనుంది. ఇక సెమీఫైనల్‌కు చేరిన ఫ్రాన్స్‌, నెదర్లాండ్స్‌కు చెరో రూ. 101 కోట్ల ప్రైజ్‌ మనీ దక్కనుంది.

యంగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ది టోర్నీ: లామిన్ యమల్ (స్పెయిన్)

ఈ టోర్నీలో లామిన్ యమల్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు.17 ఏళ్ల యమల్ ఒక గోల్‌తో పాటు 4 అసిస్ట్‌లు చేశాడు. ఈ యువ ప్లేయర్‌ కచ్చితంగా ఫ్యూచర్‌ స్టార్‌ అవుతాడనడంలో ఎటువంటి సందేహం లేదు.

ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్: రోడ్రి (స్పెయిన్)
స్పెయిన్ తరఫున మిడ్‌ఫీల్డ్‌లో రోడ్రి అదరగొట్టాడు. స్పెయిన్‌ విజేతగా నిలవడంలో రోడ్రిది కీలకపాత్ర.

 

గోల్డెన్ బూట్ విజేతలు వీరే..
యూరో కప్‌-2024 గోల్డన్‌ బూట్‌ విజేతలగా ఆరుగురు నిలిచారు. మొత్తం ఆరు మంది ఆటగాళ్లు సమంగా 3 గోల్స్‌ చేసి సంయుక్తంగా గోల్డన్‌ బూట్‌ అవార్డును తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ జాబితాలో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ హ్యారీ కేన్, స్పెయిన్ అటాకింగ్ మిడ్‌ఫీల్డర్ డాని ఓల్మో, జార్జియా మిడ్‌ ఫిల్డర్‌ జార్జెస్ మికౌతాడ్జే,  కోడి గక్పో, ఇవాన్ ష్రాంజ్,జమాల్ ముసియాలా ఉన్నారు.

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)