Breaking News

లాస్ట్‌ మ్యాచ్‌ ఆడేసిన మెస్సీ

Published on Mon, 06/05/2023 - 09:51

స్టార్‌ ఫుట్‌బాలర్‌ లియోనల్‌ మెస్సీ పారిస్‌ సెయింట్‌-జెర్మైన్‌ (PSG) క్లబ్‌ తరఫున తన ఆఖరి మ్యాచ్‌ ఆడేశాడు. ఈ మ్యాచ్‌లో పీఎస్‌జీ.. క్లెర్మాంట్‌ క్లబ్‌ చేతిలో 2-3 గోల్స్‌ తేడాతో ఓటమిపాలైంది. మెస్సీతో పాటు సెర్గియో రామోస్‌కు కూడా పీఎస్‌జీ తరఫున ఇదే చివరి మ్యాచ్‌. తొలి అర్ధ భాగంలో పీఎస్‌జీ తరఫున రామోస్‌, ఎంబపె చెరో గోల్‌ సాధించగా.. క్లెర్మాంట్‌ తరఫున జోహన్‌ గస్టీన్‌, మెహ్ది జెఫ్ఫానే గోల్స్‌ చేశారు.

అనంతరం సెకెండ్‌ హాఫ్‌లో (63వ నిమిషం) గ్రెజాన్‌ కై గోల్‌ చేసి క్లెర్మాంట్‌కు ఆధిక్యాన్ని అందించాడు. ఇదే లీడ్‌ చివరి వరకు కొనసాగడంతో క్లెర్మాంట్‌.. పీఎస్‌జీపై విజయం సాధించింది. సెకెండ్‌ హాఫ్‌లో మెస్సీకి రెండు గోల్స్‌ చేసే అవకాశం (ఫ్రీ కిక్‌) వచ్చినా, అవి వర్కౌట్‌ కాలేదు. మొత్తంగా ప్రస్తుత తరంలో ఫుట్‌బాల్‌ దిగ్గజాలుగా చెప్పుకునే మెస్సీ, రామోస్‌ ఓటమితో పీఎస్‌జీకి వీడ్కోలు పలికారు.

కాగా, మెస్సీ.. సౌదీ అరేబియాకు చెందిన అల్‌ హిలాల్‌ క్లబ్‌తో కళ్లు చెదిరే మొత్తానికి ఒప్పందం చేసుకున్నాడని సమాచారం. కొద్ది రోజుల్లో ఈ విషయాన్ని అల్‌ హిలాల్‌ ప్రకటిస్తుందని తెలుస్తోంది. మెస్సీ సహచరుడు, పోర్చుగల్‌ స్టార్‌ ఫుట్‌బాలర్‌ క్రిస్టియానో రొనాల్డో సైతం​ సౌదీ అరేబియాకు చెందిన ఓ క్లబ్‌తో భారీ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.

చదవండి: జొకోవిచ్‌ రికార్డు

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)