Breaking News

ఎస్ఆర్‌హెచ్‌లోకి విధ్వంస‌క‌ర వీరుడు.. ఎన్ని కోట్లంటే?

Published on Tue, 12/16/2025 - 21:04

ఐపీఎల్‌-2026 మినీ వేలంలో ఇంగ్లండ్ ఆల్‌రౌండ‌ర్ లైమ్ లివింగ్‌స్టోన్‌కు క‌ళ్లు చెదిరే ధ‌ర ద‌క్కింది. ఈ డేంజ‌రస్ ప్లేయ‌ర్ల‌ను రూ. 13 కోట్ల భారీ ధ‌ర‌కు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ కొనుగోలు చేసింది. రూ. 2 కోట్ల బెస్ ప్రైస్‌తో వేలం తొలి రౌండ్‌లోకి వ‌చ్చిన అత‌డిని ద‌క్కించుకునేందుకు ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు.

కానీ యాక్సలరేటెడ్ రౌండ్‌లో మాత్రం లివింగ్‌స్టోన్ కోసం ఫ్రాంచైజీలు ప్ర‌య‌త్నించాయి. ముఖ్యంగా ఎస్ఆర్‌హెచ్‌, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ మ‌ధ్య తీవ్ర‌మైన పోటీ నెల‌కొంది. ఎల్ఎస్‌జీ ఫ్రాంచైజీ తమ పర్స్‌లో ఉన్న డబ్బులతో చివరి వరకు బిడ్డింగ్ చేసింది. కానీ ఎస్ఆర్‌హెచ్ మాత్రం ఎక్క‌డ కూడా వెన‌క్కి త‌గ్గ‌లేదు.

 దీంతో ల‌క్నో పోటీ నుంచి త‌ప్పుకోంది. చివ‌రికి అత‌డు హైద‌రాబాద్ సొంత‌మ‌య్యాడు. లివింగ్‌స్టోన్ గ‌త సీజ‌న్‌లో రాయల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు ప్రాతినిథ్యం వ‌హించాడు. కానీ వేలానికి ముందు అత‌డిని ఆర్సీబీ త‌మ జ‌ట్టు నుంచి రిలీజ్ చేసింది. దీంతో వేలంలోకి వ‌చ్చిన అత‌డికి జాక్ పాట్ త‌గిలింది.

కానీ ఈ మినీ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ.. లియామ్ లివింగ్‌స్టోన్ మినహా మిగతా అందర్నీ అన్‌క్యాప్డ్ భార‌త ప్లేయర్ల‌నే కొనుగోలు చేసింది. సన్‌రైజర్స్ సొంతం చేసుకున్న ఆటగాళ్ల వీళ్లే.. లియామ్ లివింగ్‌స్టోన్, సలీల్ అరోరా, క్రైన్స్ ఫులేత్రా, ప్రఫుల్ హింజే, ఓంకార్ తర్మాలే, అమిత్ కుమార్, షాకిబ్ హుస్సేన్, శివాంగ్ కుమార్.
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)