Breaking News

వరల్డ్‌ X యూరప్‌

Published on Fri, 09/19/2025 - 04:23

శాన్‌ఫ్రాన్సిస్కో (అమెరికా): ప్రపంచ పురుషుల టెన్నిస్‌లోని మేటి ఆటగాళ్లతో ప్రతి యేటా నిర్వహించే ‘లేవర్‌ కప్‌’ టోర్నమెంట్‌కు రంగం సిద్ధమైంది. నేటి నుంచి అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో మూడు రోజులపాటు ఈ టోర్నీ జరుగుతుంది. టీమ్‌ యూరప్, టీమ్‌ వరల్డ్‌ జట్ల మధ్య ఈ టోర్నీని నిర్వహిస్తారు. 2017లో మొదలైన ఈ టోర్నీ 2020లో కరోనా మహమ్మారి కారణంగా జరగలేదు. ఇప్పటి వరకు ఏడుసార్లు ఈ టోర్నీ జరగ్గా... ఐదుసార్లు టీమ్‌ యూరప్‌ (2017, 2018, 2019, 2021, 2024), రెండుసార్లు టీమ్‌ వరల్డ్‌ (2022, 2023) ‘లేవర్‌ కప్‌’ చాంపియన్‌గా నిలిచాయి. 

ఈసారి టీమ్‌ యూరప్‌ తరఫున ప్రపంచ నంబర్‌వన్‌ కార్లోస్‌ అల్‌కరాజ్‌ (స్పెయిన్‌), మూడో ర్యాంకర్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ), 11వ ర్యాంకర్‌ హోల్గర్‌ రూనె (డెన్మార్క్‌), 12వ ర్యాంకర్‌ కాస్పర్‌ రూడ్‌ (నార్వే), 17వ ర్యాంకర్‌ జాకుబ్‌ మెన్‌సిఖ్‌ (చెక్‌ రిపబ్లిక్‌), 22వ ర్యాంకర్‌ టామస్‌ మఖచ్‌ (చెక్‌ రిపబ్లిక్‌), 25వ ర్యాంకర్‌ ఫ్లావియో కొ»ొల్లి (ఇటలీ) ఆడనున్నారు. 

టీమ్‌ వరల్డ్‌ తరఫున ప్రపంచ 5వ ర్యాంకర్‌ టేలర్‌ ఫ్రిట్జ్‌ (అమెరికా), 8వ ర్యాంకర్‌ అలెక్స్‌ డిమినార్‌ (ఆ్రస్టేలియా), 21వ ర్యాంకర్‌ ఫ్రాన్సిస్కో సెరున్‌డోలో (అర్జెంటీనా), 32వ ర్యాంకర్‌ అలెక్స్‌ మిచెల్సన్‌ (అమెరికా), 42వ ర్యాంకర్‌ జోవా ఫోన్సెకా (బ్రెజిల్‌), 62వ ర్యాంకర్‌ రిలీ ఒపెల్కా (అమెరికా), 86వ ర్యాంకర్‌ జెన్సన్‌ బ్రూక్స్‌బై (అమెరికా) బరిలోకి దిగుతారు. టీమ్‌ యూరప్‌ జట్టుకు ఫ్రెంచ్‌ ఓపెన్‌ మాజీ చాంపియన్‌ యానిక్‌ నోవా (ఫ్రాన్స్‌)... టీమ్‌ వరల్డ్‌ జట్టుకు అమెరికా మేటి ప్లేయర్, ఎనిమిది గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ నెగ్గిన ఆండ్రీ అగస్సీ కెప్టెన్‌లుగా వ్యవహరిస్తారు.  

Videos

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు