Breaking News

లంక ప్రీమియర్‌ లీగ్‌లో భారత ఆటగాళ్లు.. చరిత్రలో తొలిసారి..!

Published on Mon, 10/06/2025 - 16:03

శ్రీలంక వేదికగా జరిగే లంక ప్రీమియర్‌ లీగ్‌ (Lanka Premier League) ఆరో ఎడిషన్‌కు సిద్దమైంది. ఈ ఏడాది డిసెంబర్‌ 1 నుంచి 23 వరకు జరుగనుంది. లీగ్‌ చరిత్రలో ఇదే అత్యంత సుదీర్ఘంగా సాగనున్న ఎడిషన్‌. ఈ ఎడిషన్‌ మొత్తం 24 రోజుల పాటు జరుగుతుంది.

ఇందులో 20 లీగ్‌ స్టేజీ మ్యాచ్‌లు, 4 నాకౌట్‌ మ్యాచ్‌లు సహా మొత్తం 24 మ్యాచ్‌లు జరుగుతాయి. 5 ఫ్రాంచైజీలు పాల్గొనే ఈ లీగ్‌ కోసం​ మూడు వేదికలు ఇదివరకే సిద్దం చేయబడ్డాయి. 

కొలొంబోని ప్రేమదాస స్టేడియం, క్యాండీలోని పల్లెకెలె స్టేడియం, డంబుల్లాలోని రణగిరి స్టేడియం ఎల్‌పీఎల్‌ మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనున్నాయి.

తొలిసారి భారత ప్లేయర్లు
ఈ లీగ్‌లో తొలిసారి భారత ప్లేయర్లు​ పాల్గొననున్నారని తెలుస్తుంది. ఇందుకోసం ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని సమాచారం. బీసీసీఐ నిబంధనల ప్రకారం భారత ఆటగాళ్లు విదేశీ లీగ్‌ల్లో పాల్గొనలేరు. రిటైర్డ్‌ ఆటగాళ్లు, నాన్‌ కాంట్రాక్ట్‌ ప్లేయర్లు, బీసీసీఐతో సంబంధాలు తెంచుకున్న ఆటగాళ్లకు మాత్రం ప్రత్యేక వెసులుబాటు ఉంటుంది.

వీరు కూడా బీసీసీఐ నుంచి నామమాత్ర అనుమతి తీసుకోవాలి. లంక ప్రీమియర్‌ లీగ్‌ అధికారుల అభ్యర్థన మేరకు కొందరు నాన్‌ కాంట్రాక్ట్‌ ఆటగాళ్లను లంక ప్రీమియర్‌ లీగ్‌ 2025లో పాల్గొనేందుకు బీసీసీఐ క్లీన్‌ చిట్‌ ఇచ్చినట్లు తెలుస్తుంది. 

వీరిలో టీమిండియా మాజీ ప్లేయర్లు, ఐపీఎల్‌ స్టార్లు సురేశ్‌ రైనా, యూసప్‌ పఠాన్‌, మనోజ్‌ తివారి, రాహుల్‌ శర్మ తదితర ఆటగాళ్లు ఉన్నట్లు సమాచారం. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.

కాగా, భారత క్రికెట్‌తో పూర్తిగా బంధాన్ని తెంచుకున్న దినేశ్‌ కార్తీక్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌ ఇటీవలే ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌, బిగ్‌బాష్‌ లీగ్‌లతో ఒప్పందాలు చేసుకున్న విషయం తెలిసిందే.

చదవండి: World Cup 2025: టీమిండియా చేతిలో ఓడినా చరిత్ర సృష్టించిన పాకిస్తాన్‌

Videos

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)